'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (08:28 IST)
పపర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని జూన్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. 
 
దీన్ని పురస్కరించుకుని చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 8వ తేదీన తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీలో ఉన్న తారకరామా క్రీడా మైదానంలో ఈ నెల 8వ తేదీన వేడుక నిర్వహించనున్నారు. ఇందుకోసం 7వ తేదీ రాత్రి హీరో పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. 
 
నిజానికి ఈ చిత్రానికి తొలుత దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది క్రిష్ జాగర్లమూడి. అయితే ప్రాజెక్టుకు ఎక్కువ సమయంపట్టడంతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆయ స్థానంలో ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఎపుడో ప్రారంభమైన ఈ చిత్రం కోవిడ్‌తో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, ఇలా అనేక కారణాల వల్ల చిత్రం విడుదలలో జాప్యం నెలకొంది. మే నెలలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన పవన్ ఇపుడు.. ఆ తర్వాత డబ్బింగ్‌ను కేవలం నాలుగు గంటల్లో పూర్తి చేశారు. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం