Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్భజన్ సింగ్ నటించిన 'ఫ్రెండ్‌షిప్' ట్రైలర్ రిలీజ్

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (08:42 IST)
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఫ్రెండ్‌షిప్'. ఇన్నాళ్లూ క్రికెట్ మైదానంలో సందడి చేసిన భజ్జీ.. ఇపుడు వెండితెరపై ఆలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ కీలకమైన పాత్రను పోషించారు. అలాగే, తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లాస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా నటించింది. 
 
ఈ నెల 17వ  తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌లకానుంది. ఈ క్రమంలో తెలుగులో చిత్ర ట్రైల‌ర్‌ని హీరో అక్కినేని నాగార్జున తాజాగా రిలీజ్ చేశారు. అలాగే, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. 
 
'ఓ అమ్మాయి హ‌త్య జ‌ర‌గ‌డం.. అందులో భ‌జ్జీతో పాటు ప‌లువురు కాలేజ్ స్టూడెంట్స్‌ని బాధ్యుల‌ని చేస్తూ అరెస్ట్ చేయ‌డం' ట్రైల‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 
 
'ఏ ఒక్క స్త్రీ.. మగవాడి ప్రత్యేక అవసరం కోసం సృష్టించింది కాదు.. ఆడది అంటే మనకు బాధ్యత. ఈ అందమైన విషయాన్ని మాకు నేర్పింది ఫ్రెండ్‌షిప్' అనే వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది. యాక్ష‌న్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శక ద్వయం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
ఈ సినిమాని టోవా స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై జేపీఆర్ - స్టాలిన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డీఎం ఉదయ్ కుమార్ సంగీతం సమకూర్చగా.. సి.శాంతా కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments