Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

దేవీ
శనివారం, 10 మే 2025 (19:52 IST)
Clap by niharika konidala
బ్రహ్మాజీ, కమిటీ కుర్రోళ్ళు యశ్వంత్ పెండ్యాల లీడ్ రోల్స్ లో ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ కథకళి. మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు.  ఈ రోజు ఈ సినిమా పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హర్షిత్ రెడ్డి కెమరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా ఫస్ట్ షాట్ కి డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని దర్శకత్వం వహించారు.
 
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. కథాకళి టీంకి బిగ్ కంగ్రాట్యులేషన్స్. యశ్వంత్ మా కమిటీ కుర్రాళ్ళు సినిమాల్లో నటించాడు. తన కొత్త సినిమా ముహూర్తానికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాజీ గారు యశ్వంత్ కి చాలా మంచి సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.  
 
బ్రహ్మాజీ మాట్లాడుతూ, మాన్యతా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో కథ హీరో. కాన్సెప్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ మీ బ్లెస్సింగ్స్ కావాలి'అన్నారు.  
 
డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ. మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో వస్తున్నాం నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ కాబోతోంది. అందరికీ థాంక్యు. ఈవెంట్ కి వచ్చిన అందరికీ థాంక్యు'అన్నారు
 
నిర్మాత మాట్లాడుతూ.. ఈ లాంచింగ్ ఈవెంట్ కి వచ్చిన అతిథులందరికీ థాంక్యూ సో మచ్. వారందరూ సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బ్రహ్మాజీ గారు ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. చాలా మంచి టీం తో కలిసి సినిమా చేస్తున్నాం'అన్నారు  
 
యశ్వంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో హీరోలు ఎవరు ఉండరు. ఈ సినిమాకి హీరో కథ.  కథను నడిపించే పాత్రలు ఉంటాయి. నిహారిక గారు ఈ వేడుకకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  బ్రహ్మాజీ గారికి థాంక్యూ సో మచ్'అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments