Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyBirthdayRajinikanth.. 12-12-20.. పార్టీ ప్రకటన చేసివుంటే బంపర్ హిట్టే..!

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (08:42 IST)
'సూపర్ స్టార్ రజనీకాంత్'కు డిసెంబర్ 12 అయిన నేడు పుట్టిన రోజు. ఇండియన్ సినిమాకు సంబంధించి ఆయన పరిచయం అక్కరలేని వ్యక్తి. అంతర్జాతీయం గానూ పేరు ప్రతిష్టలు, అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి.. నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ 70వ పుట్టినరోజు. ఏడు పదుల వయసులోనూ సినీ ప్రేక్షకులకు తన స్టైల్‌తో ఏ మాత్రం పదును తగ్గలేదని నిరూపిస్తూనే ఉన్నారు రజనీకాంత్.
 
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను భారతీయ ప్రేక్షకులకు అందించారు. సినీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. దశాబ్దాల సినీ జీవితంలో.. ఆయన కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందంటే ఆతిశయోక్తి కాదు.
 
సినీరంగం నుంచి ఎందరో స్టార్లు.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అదే పంథాలో రజనీకాంత్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లోను రజనీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయ రంగంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని తలైవా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
 
డిసెంబర్ 31వ తేదీన రజీని రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రజినీ పుట్టినరోజు వేడుకలను జరుపుకునేందుకు అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు.  
 
సాధారణంగా రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా సినిమా టీజర్లు, పోస్టర్లు విడుదల చేస్తుంటారు. ఇదే తరహాలో పార్టీని కూడా ఈరోజే ప్రకటించి వుండవచ్చునని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వ్వాళ్టి బర్త్ డే సందర్భంగా.. పార్టీకి సంబంధించినది రిలీజ్ చేసి ఉంటే.. సినిమాలాగే.. పార్టీ కూడా బంపర్ హిట్ అయ్యేదని సినీ పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments