Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (08:49 IST)
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం "హనుమాన్". ప్రశాంత్ వర్మ. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా ఆ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్స్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ వారంలో కూడా ఈ చిత్రం భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. 
 
ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ ఎపుడైతే బయటకి వచ్చాయో అప్పటి నుంచి అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా, పెద్ద సినిమాలతో పోటీ పడుతూ ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. కథ నేపథ్యంలో హనుమంతుడిని చూపిస్తూ, పిల్లల నుంచి పెద్దల వరకు వినోదాన్ని పంచడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు. 
 
హీరో పాత్రను, విలన్ రోల్‌ను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉండటంతో పాటు గ్రామీణ నేపథ్యంలో నడిచే కథలోని సహజత్వం సినిమాకు ప్రధానమైన బలంగా నిలిచాయి. ఫోటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, నేపథ్య సంగీతం, ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్ట్ కావడానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాంగ్ రన్‌లో ఈ సినిమా వసూళ్లు ఏ స్థాయిలో వెళతాయో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments