Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పులుసంటే మహాయిష్టమంటున్న హీరోయిన్!

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (16:27 IST)
తనకు చేపల పులుసంటే మహాయిష్టమని టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని చెబుతోంది. అలాగే టాలీవుడ్‌లో కేవలం హీరోయిన్‌గా మాత్రమేకాకుండా 'లౌక్యం' చిత్రం తరహాలో ఉన్న కామెడీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. 
 
మోడల్‌గా రాణిస్తూ వచ్చిన హంసా నందిని ఆ తర్వాత 'ఒక్కటవుదాం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఆమె... ఇప్పటివరకు 29 చిత్రాల్లో నటించింది. తన అసలు పేరు పూనం అని చెప్పుకొచ్చింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి' సినిమాలో మధునిక పాత్ర తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువచేసిందని చెప్పింది. 
 
పలు సినిమాలో హీరోయిన్‌గా, ప్రత్యేక గీతాలకు డ్యాన్సర్‌ను నటించిన తనకు గోపీచంద్‌ హీరోగా నటించిన 'లౌక్యం' సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా చేసిన పాత్ర బాగా నచ్చింది. కామెడీ పండించే పాత్ర అది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలాగే 'మిర్చి', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో మంచిపేరు వచ్చిందని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments