పవన్ కల్యాణ్‌కు ''హాఫ్ నాలెడ్జ్'' అన్న మహేష్ కత్తి.. ఫేస్‌బుక్‌లో పోస్ట్

సినీన‌టుడు, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై‌‍ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు తనను టార్చర్ చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన స

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (10:42 IST)
సినీన‌టుడు, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై‌‍ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు తనను టార్చర్ చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వ్య‌వ‌సాయ శాఖ‌లో ఉద్యోగాలు, ప‌దోన్న‌తుల‌కు సంబంధించిన జీవో నెంబ‌రు 64ను ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆ జీవోను ర‌ద్దు చేయాల‌ని అంత‌కు రెండు రోజుల ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్ సర్కారుని కోరాడు. దీంతో వ్యవసాయ పట్టభద్రుల సంఘం పవన్ కల్యాణ్‌పై మండిపడుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. పవన్ తమ జీవితాలతో ఆడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్తను చదివిన మహేష్ కత్తి.. హాఫ్ నాలెడ్జ్ ఎల్ల‌ప్పుడూ ప్ర‌మాద‌మేన‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
 
అంతేగాకుండా జీవో రద్దుపై సర్కారును కోరమని పవన్ కల్యాణ్‌‌కు ఎవరు సలహా ఇచ్చారో తెలియట్లేదని ఎద్దేవా చేశాడు. ఈ సందర్భంగా వ్యవ‌సాయ ప‌ట్ట‌భ‌ద్రుల సంఘం ధ‌ర్నా చేస్తోన్న వార్త‌ను ఆయ‌న త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా.. మహేష్‌ను వైసీపీ వాడుకుంటుందని.. పవన్ కల్యాణ్‌‍పై‌ అందుకే కత్తి సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
త్వరలో జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేనపై బురద చల్లేందుకు, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును గందరగోళపరిచేందుకు, జనాల్లో జనసైన్యాన్ని విద్రోహ శక్తులుగా చిత్రీకరించేందుకు జగన్.. కత్తి మహేష్‌ను వాడుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్, విజయవాడ

103 gold coins: తమిళనాడులోని జవ్వాదు కొండల్లో 103 బంగారు నాణేలతో మట్టి కుండ లభ్యం

Karthika Pournami Special : కార్తీక పౌర్ణమి- తెలుగు రాష్ట్రాల్లో కళకళలాడుతున్న శైవక్షేత్రాలు

కుటుంబ కలహాలు.. రెండేళ్ల కుమార్తెతో హుస్సేన్ సాగర్‌లో దూకేసిన మహిళ

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments