Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ గీతాంజలి: సత్యదేవ్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (19:21 IST)
Satyadev, Megha Akash
హీరో సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా  న‌టించిన  సినిమా 'గుర్తుందా శీతాకాలం. క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రంతో  తెలుగులో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు,  చిత్రాన్ని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్ లాంచ్ చేసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు.  
 
దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ.. ఇది నా డెబ్యూ ఫిలిం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు థాంక్యూ. ఎక్కడికి వెళ్లిన ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. క్రెడిట్ గోస్ టూ హీరో సత్యదేవ్ గారు. డిశంబర్ 9న ఈ సినిమాకి రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి.
 
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ..ఈ సినిమాలో నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. అన్ని సెక్షన్స్ కి కనెక్ట్ అయ్యే ఒక సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ నాలుగు ఫేజ్ స్ అయిపోయినవాళ్లు ఉంటారు, ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి.  ఈ సినిమాను భూపాల అన్న రాసేసి డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించాడు నాగశేఖర్ అన్న. ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు "గుర్తుందా శీతాకాలం" ఈ జనరేషన్ గీతాంజలి అన్నట్లు ఈ సినిమాను చేసాడు. ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మి భూపాల అన్న నా సినిమా అంటే పెన్ , పేపర్ తో పాటు ప్రేమను కూడా కలుపుతారు. కాల భైరవ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు. ఈ శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం గుర్తుండిపోతుంది అంటూ  నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments