Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బామ్మర్ధికో న్యాయం.. నాకో న్యాయమా? చంద్రబాబుపై 'రుద్రమదేవి' గుణశేఖర్ డైరక్ట్ అటాక్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. బాలయ్య నటించిన వందో చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి"కి తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. ఏపీ సర్కారు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చి

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (06:38 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు. బాలయ్య నటించిన వందో చిత్రం "గౌతమిపుత్రశాతకర్ణి"కి తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. ఏపీ సర్కారు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇది ఇపుడు వివాదాస్పదంగా మారింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబుపై గుణశేఖర్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 
 
2015లో గుణశేఖర్ కాకతీయుల వీరనారి రుద్రదేవి జీవితగాథ ఆధారంగా 'రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోదనపు పన్నుని మినహాయించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉంచింది. ఇప్పుడు 'గౌతమిపుత్ర శాతకర్ణి' నిర్మాతలు అడగ్గానే ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఇదే సరైనసమయమని భావించిన దర్శకుడు గుణశేఖర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. 'రుద్రమదేవి' చిత్రంపై వినోదపు రాయితీ విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ కాపీని సోషల్ మీడియాలోనూ ఉంచారు. దీంతో ఇప్పుడీవ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మరీ.. గుణశేఖర్ వినతిపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
 
కాగా, బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుజాతి ఔనత్యాన్ని, గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments