Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది క‌శ్మీర్ ఫైల్స్ చూసిన‌ ప్రేక్ష‌కుల‌కు పాదాభివంద‌నాలు - అభిషేక్ అగ‌ర్వాల్‌

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (16:36 IST)
abhishek Agarwal
వివేక్ అగ్నిహోత్రి ద‌ర్శ‌క‌త్వంలో `ది క‌శ్మీర్ ఫైల్స్‌` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగ‌ర్వాల్ ప్ర‌పంచంలోని హిందూ పండిట్‌ల‌కు, ప్రేక్ష‌కుల‌కు చిత్రాన్ని అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశంలో ఈ సినిమా విడుద‌లైన అన్నిచోట్ల‌నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా అభిషేక్ అగ‌ర్వాల్ హైద‌రాబాద్‌లో త‌న సంస్థ కార్యాల‌యంలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.
 
- ముందుగా ఈ సినిమాను ఆద‌రిస్తున్న యావ‌త్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ఇప్ప‌టికే ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో జేరింది. ఇంత ఆద‌ర‌ణ చూపిస్తున్న ప్ర‌తి హిందూపండిట్‌కూ, ప్రేక్ష‌కుల‌కు పాదాభివందనాలు తెలియ‌జేస్తున్నా.
- సినిమా విడుద‌ల‌కు ఐదురోజుల ముందు ఒక మ‌హిళ ఢిల్లీనుంచి 20వేల రూపాయ‌ల‌తో టికెట్‌పెట్టుకుని న‌న్ను వెతుక్కుంటూ మ‌రీ హైద‌రాబాద్‌వ‌చ్చి  క‌లిసింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్ప‌డానికి మాట‌లు రావ‌డంలేదు. 32 ఏళ్ళ గురించి మా పండిట్‌ల గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో స‌ఫ‌ర్ అయింది అంటూ ఆమె జ్ఞాప‌కాలు తెలియ‌జేసింది.
- అదేరోజు రాత్రి క‌శ్మీర్ పండిట్‌ల‌తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. 2వేల మంది పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ థ్యాంక్స్ యూ సార్ అని చెప్పారు.
 
- సినిమా అనేది క‌మ‌ర్షియ‌ల్‌. కానీ 5 ల‌క్ష‌ల మంది క‌శ్మీర్ పండిట్‌ల బాధ‌లు, స‌మ‌స్య‌లను 32 ఏళ్ళ‌నాటివి బ‌య‌ట‌కు తెచ్చాను. నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. 
- ముఖ్యంగా యూత్‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ ఫీలింగ్‌ను వ్య‌క్తం చేశారు. 
- ఈ సినిమా చేసేట‌ప్పుడు ఆర్టిక‌ల్ 370 గురించి రీసెర్ఛ్  చేశాం.. మూడు నెల‌ల‌పాటు యు.ఎస్‌., కెనడ‌, ద‌క్షిణాఫ్రికా మొద‌లైన ప్ర‌దేశాలు తిరిగి అక్క‌డున్న‌వారి నుంచీ ఫీడ్ బేక్ తీసుకున్నాం.
 
-  హిందీలో ఇది నా తొలి సినిమా. దీనికి సీక్వెల్ అనేది వుండ‌దు.
- వివేక్ క‌థ చెప్పాకే నాకు సినిమా చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. 
 - ఇది ప్ర‌జ‌ల సినిమా. ఇత‌ర సినిమాలు అదే టైంలో విడుద‌లైనా వారి ఇష్టం మేర‌కు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్ద‌గా ప‌బ్లిసిటీ కూడా ఇవ్వ‌లేదు. చిన్న సినిమా కాబ‌ట్టి ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌ర‌ని తెలుసు. కానీ సినిమా విడుద‌ల‌య్యాక అన్ని చోట్ల‌నుంచి, ముఖ్యంగా తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో ఎంతోమంది అభినంద‌లు కురిపించారు.
- అందుకే ఈ సినిమాప‌రంగా ఏదైనా అభినంద‌లు వుంటే అది క‌శ్మీర్ పండితుల‌కు చెల్లుతుంది. వారికే ఈ సినిమా అంకితం.
- ప్ర‌ధాని మోడీగారిని క‌ల‌వ‌డం అనేది యాదృశ్చికంగా జ‌రిగింది. ఒక‌రోజు ఆయ‌న ఆఫీసునుంచి ఫోన్ వ‌చ్చింది. వెళ్ళి క‌లిశాం. ఆయ‌న‌తో గ‌డిపిన క్ష‌ణాలు మ‌ర్చిపోలేను.
- ఈ సినిమా త‌ర్వాత ప‌ర్యావ‌స‌నాలు ఏమైనా వుంటే ఛాలెంజ్‌గా తీసుకున్నాం. సినిమా తీసేట‌ప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుద‌ల‌కుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే ముందుగా ప్రిపేర్ అయ్యాను.
- క‌రెక్ట్‌గా చెప్పాలంటే నిజాయితీగా తీస్తే భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు. నేను ఏదైనా త‌ప్పుగా చూపిస్తే ప్ర‌జ‌లే స‌పోర్ట్ చేయ‌రు.
- త్వ‌ర‌లో దేశంలో అన్ని భాష‌ల్లో డ‌బ్ చేసే ఆలోచ‌న వుంది. తెలుగులోకూడా డ‌బ్ చేయ‌బోతున్నాం. 
- మా సినిమాకు అస్సాం, యు.పి., గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా, క‌ర్నాట‌క‌తోస‌హా మొత్తం  9 రాష్ట్రాల‌లో టాక్స్ మిన‌హాయింపు వ‌చ్చింది.
- ఇంకా ఈ సినిమాలో చెప్ప‌లేని కొన్ని విష‌యాలున్నాయి. ఏదిఏమైనా 370 ఆర్టిక‌ల్ వ‌ర‌కే సినిమా తీశాం. ఆ త‌ర్వాత కంటెన్యూ చేసే ఆలోచ‌న ప్ర‌స్తుతం లేదు.
- ఈ సినిమాలో నాతోపాటు నా కుటుంబ‌స‌భ్యులు, స్టాఫ్ కూడా ఎంతో స‌పోర్ట్ చేశారు. 24గంట‌లు వారు ఈ సినిమాకు ప‌నిచేశారు.
 
- ఈ సినిమాలో అనుప‌మ్ ఖేర్ క‌శ్మీర్ పండిట్‌గా న‌టించారు. ఆయ‌న పాత్ర‌లో లీన‌మై పోయారు. ఆయ‌నేకాదు చాల‌మంది న‌టీన‌టులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్ర‌లో మ‌మేకం అయి నిద్ర స‌రిగ్గా ప‌ట్టేదికాదు వారికి.
- షూటింగ్ జ‌రుగుతుండ‌గా అనుప‌మ్ ఖేర్‌ను అక్క‌డి హిందూవులు డిన్న‌ర్‌కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా త‌ను ఇంటిద‌గ్గ‌ర వండి భోజ‌నం తీసుకువ‌చ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును క‌లిసి వారితో షేర్ చేసుకున్న సంగ‌తులు నిర్మాత‌గా నాకు సంతృప్తినిచ్చాయి.
 
- నా కొత్త సినిమాలు.
ర‌వితేజ‌తో నా డ్రీమ్ ప్రాజెక్ట్‌.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చేస్తున్నా. ఆ త‌ర్వాత అబ్దుల్ క‌లాం బ‌యోపిక్ చేయ‌బోతున్నాం. అదేవిధంగా ద‌ర్శ‌కుడు వివేక్‌తో ఢిల్లీఫైల్స్ అనే సినిమా ఆలోచ‌న‌లో వుంది. అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments