Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ వారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (17:57 IST)
తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హారిత హారం (గ్రీన్ ఇండియా ఛాలెంజ్) పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నాయి. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా ''ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్'' ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు పండగే టీమ్‌తో పాటు మేయర్ బొంతు రామ్మెహన్, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌లతో బంజారాహిల్స్‌లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్‌లో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు. 
 
ఈ సందర్బంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ మాట్లాడారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని అన్నారు. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తనను భాగం చేసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 
 
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అలాగే హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో సహా నిర్మాత ఎస్కేఎన్, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments