Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (22:35 IST)
గౌరవ రాజ్యసభ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు, కార్యకర్త నుండి ప్రధాన కార్యదర్శుల వరకు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, కోటా నుండి కోలకతా వరకు, సెర్చ్ ఇంజిన్లో టాప్, ట్రెండింగ్‌లో హిస్టరీ, ఆల్ ఇండియాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ఇలా ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.
 
ఇందులో భాగంగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గచ్చిబౌలి లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ... మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం, మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు, అలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి.
 
మన అవగాహనా లోపంతో మనం మొక్కలు నాటడం అశ్రద్ధ చేస్తున్నాం కానీ అలా చేయకుండా ఈ ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలి అని, ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా... ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి నా వంతుగా మరో ముగ్గురు యాక్టర్ సుశాంత్, డైరెక్టర్ శివ నిర్వాణ, నటి రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ గార్లని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి నామినేషన్ చేశారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments