సంతోషం పేరుతొ సురేష్ దాదాపు ఇరవై ఏళ్లుగా ఇంత గ్రాండ్ గా అవార్డు వేడుకలు నిర్వహించడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి అవార్డులు అందివ్వాలన్న కోరిక మనసులో బలంగా ఉంటేనే ఏదైనా చేయగలం- అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
సంతోషం 20 వ అవార్డు వేడుకలు సంతోషం - సుమన్ టివి ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ఫిలిం అవార్డు వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని నోవొటెల్ కన్వేషన్ సెంటర్ లో జరిగాయి. 2019 మరియు 2020 సంవత్సరాలకు గాను ఈ అవార్డులు అందచేశారు.ఈ వేడుకలకు ముఖ్య అథితి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు.
Bharati raja-suresh, muralimohan
చిరంజీవి ఇంకా మాట్లాడుతూ, సురేష్ ప్రతి ఏడాది ఈ అవార్డు వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ సారి సంతోషానికి సుమన్ టివి తోడైంది. వీరిద్దరూ కలిసి ఇలాగె ప్రతి ఏడాది అవార్డులు అందించే కార్యక్రమం చేయాలనీ కోరుకుంటున్నాను. నిజంగా సినిమా కళాకారులకు అవార్డులు అనేవి ఓ గొప్ప ఉత్సహాన్ని ఇచ్చే వేడుక. నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం సినిమా కళాకారులను అవార్డులు అందించి సత్కరించాలి. కానీ రాష్ట్రం విడిపోయిన తరువాత అటు ఆంధ్రా ప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మరచిపోయాయి. ఇకపై అయినా ఈ రెండు ప్రభుత్వాలు అలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిది అన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఫిలిం ఫేర్, సైమా స్థాయిని తగ్గకుండా సురేష్ గ్రాండ్ గా ఈ అవార్డులు అందిస్తుండడం గొప్ప విషయం. తెలుగు చిత్రపరిశ్రమ ఈ మధ్య దేశ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా రంగానికి గొప్ప ప్రోత్సహం అందించే దిశగా ఎప్పుడు ముందు ఉంటుంది అన్నారు.
chiru- tamanna ph
అల్లు అరవింద్ మాట్లాడుతూ .. సురేష్ ఏదైనా పట్టు పట్టాడంటే కచ్చితంగా దాన్ని సాధించి తీరుతాడు. సంతోషం అవార్డు వేడుకలు గత ఇరవై ఏళ్లుగా నిర్వహించడం మాములు విషయం కాదు. ఈ సందర్బంగా అతన్ని నేను అభినందిస్తున్నాను. గత 17 సంవత్సరాలు నుండి అల్లు రామలింగయ్య గారి స్మారక అవార్డు కూడా అందచేయడం ఆనందించే విషయం. ఇక ఈ వేదికపై వందమంది సింగర్స్ తో వంద పాటలతో మనం అందరం కోల్పోయిన ఎస్పీ బాలు కు ట్రిబ్యూట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అన్నారు.
Suman, Ramakrishan,muralimohan
ఆది శేషగిరి రావు మాట్లాడుతూ .. సంతోషం సుమన్ టివి 20 వ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డు వేడుక ఇంత గ్రాండ్ గా జరిపిన సురేష్ కొండేటి ని అభినందిస్తున్నాము. ఇరవై ఏళ్లుగా ఒక్కడే అన్ని విషయాల్లో ముందుండి ఈ రేంజ్ లో అవార్డు వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం ఈ సందర్బంగా సంతోషం అవార్డులు అందుకున్న వారిని అభినందిస్తున్నాను. అలాగే సురేష్ ఈ అవార్డు వేడుకలను ఇలాగే కంటిన్యూ చేస్తావని ఆశిస్తున్నాను అన్నారు.
Viswak sen family
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం. వారు సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు. నా సినిమాలు ఎన్నో తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక చిరంజీవి ఆనాడు అలా ఉన్నాడో ఇప్పటికే అదే డెడికేషన్, అదే స్పిరిట్ తో ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి చిరంజీవి. అలాగే తెలుగు ప్రజలకు సినిమా అంటే మమకారం అందుకే పాండమిక్ సమయంలో కూడా థియటర్స్ కు దైర్యంగా వచ్చి మికు మేమున్నాం అని నిరూపించారు. ఇక సంతోషం అవార్డు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా లాక్ డౌన్ తరువాత ఈ రేంజ్ లో అవార్డు వేడుకను నిర్వహించినందుకు ఆయనను అభినందిస్తున్నాను అన్నారు.
LB Sriram andh others
ఇంకా ఈ వేడుకలో తమిళ దర్శకుడు భారతి రాజా, నిర్మాత అల్లు అరవింద్, మురళీమోహన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మాత జి ఆదిశేష గిరి రావు, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ , తమన్నా, పాయల్ రాజ్ పుత్, శ్రీకాంత్, నారాయణమూర్తి, అల్లరి నరేష్, సుశాంత్, ఆకాష్ పూరి, సుమన్ రంగనాధ్, దర్శకులు కిషోర్ తిరుమల, శివ నిర్వాణ , వీరబద్రం, రామజోగయ్య శాస్తి, సోహెల్ లతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో పలువురికి అవార్డు విజేతలకు సంతోషం సుమన్ టివి అవార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఇంద్రజ, లక్ష్మి రాయ్, దివి, అక్ష ఖాన్, ప్రగతి , కృష్ణ , సిద్ధార్థ్, అఖిల్, హమీద , రాతి మిత్రావ్, సందీప్, అమర్‌దీప్ తదితరులు డాన్సులతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే మరణించిన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కు ట్రిబ్యూట్ గా వందమంది సింగర్స్ తో వంద పాటలతో గ్రాండ్ ట్రిబ్యూట్ జరిగింది. ఈ వేడుకలో యాంకర్ సుమ, సుడిగాలి సుధీర్, అవినాష్, సోయల్, అరియానా, అఖుల్, సతీష్ ల యాంకరింగ్ తో అదరగొట్టారు.
తెలుగు అవార్డులు 2019
1. ఉత్తమ హీరో – మహేష్ బాబు – మహర్షి
2. ఉత్తమ కథానాయిక - తమన్నా – F2
3. ఉత్తమ హీరోయిన్ క్రిటిక్స్ సమంత - ఓ బేబీ
4. ఉత్తమ నిర్మాతలు – మహర్షి – దిల్ రాజు, అశ్వినిదత్, ప్రసాద్ వి పొట్లూరి
5. ఉత్తమ దర్శకుడు–వంశీపైడిపల్లి– మహర్షి
6. ఉత్తమ డైరెక్టర్ క్రిటిక్స్ - ఓ బేబీ - నందిని రెడ్డి
7. ఉత్తమ చిత్రం– జెర్సీ
8. ఉత్తమ స్క్రీన్ ప్లే – కిషోర్ తిరుమల – చిత్రలహరి
9. ఉత్తమ కథా రచయిత – శివ నిర్వాణ – మజిలీ
10. ఉత్తమ సంగీత దర్శకుడు – మహర్షి – దేవి శ్రీ ప్రసాద్
11. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – సైరా – ఆర్ రత్నవేలు
12. ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ - ఇస్మార్ట్ శంకర్ - ధీమాక్ ఖరాబ్
13. ఉత్తమ ఎడిటర్ – మహర్షి – ప్రవీణ్ కె ఎల్
14. బెస్ట్ ఫైట్ మాస్టర్ - సతీష్ - ఇస్మార్ట్ శంకర్
15. ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ కులకర్ణి- ఇస్మార్ట్ శంకర్- ఇస్మార్ట్
16. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ –మంగ్లీ - వాడు నదిపెబండి – జార్జ్ రెడ్డి
17. బెస్ట్ పబ్లిసిటీ డిజైనర్ – సైరా నరసింహా రెడ్డి – అనిల్ - భాను
18. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - సైరా నరసింహా రెడ్డి - సుష్మిత కొణిదెల
19. ఉత్తమ గీత రచయిత - శ్రీమణి- మహర్షి- ఇదే కదా నీ కథ
20. ఉత్తమ సంభాషణ రచయిత–ఇష్మార్ట్ శంకర్- పూరీ జగన్నాధ్ (ఆకాష్‌పురి అవార్డు అందుకున్నారు)
21. బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ – మహర్షి – అల్లరి నరేష్
22. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ - ఓ బేబీ - రాజేంద్ర ప్రసాద్
23. ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు–మహర్షి – జగపతిబాబు
24. ఉత్తమ హాస్యనటుడు – గద్దలకొండ గణేష్ – సత్య
25. ఉత్తమ హాస్యనటి – వినయవిధాయ రామ –హేమ
26. బెస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ - జ్యోతి
27. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - విశ్వక్‌సేన్ - ఫలుక్నామా దాస్
28. బెస్ట్ డెబ్యూ హీరో – శ్రీ సింహా – మత్తు వదలరా
29. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ - శివాత్మిక రాజశేఖర్ - దొరసాని
30. బెస్ట్ డెబ్యూ విలన్ - నాని గ్యాంగ్ లీడర్ - కార్తికేయ
31. ఉత్తమ హీరో (క్రిటిక్స్ ) - వరుణ్ తేజ్ - గద్దలకొండ గణేష్
32. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – హరీష్ శంకర్ – గద్దలకొండ గణేష్
33. ఉత్తమ ఎడిటర్ విమర్శకులు - ఇస్మార్ట్ శంకర్ - జునైద్
34. స్పెషల్ జ్యూరీ అవార్డు – లక్ష్మీస్ ఎన్టీఆర్ – శ్రీ తేజ్
35. ప్రత్యేక జ్యూరీ అవార్డు - లక్ష్మీ భూపాల్ - సంభాషణ రచయిత - ఓ బేబీ
36. రామానాయుడు స్మారక పురస్కారం – ఆదిశేషగిరిరావు
37. ఏన్నార్ స్మారక అవార్డు - గిరిబాబు
38. ఇవీవీ స్మారక అవార్డు - వెంకీ కుడుముల
40. అల్లు రామలింగయ్య స్మారక అవార్డు - ఎల్ బి శ్రీరామ్
41. దాసరి స్మారక అవార్డు - వి వి వినాయక్
42. కోడి రామ కృష్ణ అవార్డు - రేలంగి నరసింహారావు
43. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - మురళీ మోహన్
-----------------
2020 ఇయర్
1. ఉత్తమ హీరో – అల్లుఅర్జున్ – అలవైకుంఠపురములో
2. ఉత్తమ కథానాయిక - రష్మిక - సరిలేరునీకెవరు
3. ఉత్తమ మహిళా నిర్మాత - ఉషాముల్పూరి - అశ్వథామ
4. ఉత్తమ దర్శకుడు – త్రివిక్రమ్ శ్రీనివాస్ – అలవైకుంఠపురములో
5. ఉత్తమ చిత్రం–అలవైకుంఠపురములో (అల్లుఅరవింద్, ఎస్ రాధా కృష్ణ)
6. ఉత్తమ స్క్రీన్ ప్లే – త్రివిక్రమ్ శ్రీనివాస్ – అలవైకుంఠపురములో
7. ఉత్తమ కథా రచయిత – అనిల్ రావుపూడి – సరిలేరు నీకెవ్వరు
8. ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ తమ్మన్ - అలవైకుంఠపురములో
9. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పి ఎస్ వినోద్ – అలవైకుంఠపురములో
10. బెస్ట్ కొరియోగ్రాఫర్ – జాని మాస్టర్ – బుట్టబొమ్మ – అలవైకుంఠపురములో
11. ఉత్తమ సంపాదకుడు – నవీన్ నూలి – అలవైకుంఠపురములో
12. బెస్ట్ ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్ – అలవైకుంఠపురములో
13. ఉత్తమ నేపథ్య గాయకుడు – రఘు కుంచె – నకిలేసుగొలుసు – పలాస