Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ సినిమాకు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్‌

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (18:57 IST)
Radheshyam poster
ప్రభాస్ అభిమానుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌కటించింది. ఈరోజే ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.  రాధేశ్యామ్ ఈనెల 11న  అంటే రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇటీవ‌లే ఆంధ్ర‌లో టికెట్ రేట్ల గురించి ప్ర‌భాస్ కూడా ఎ.పి. ప్ర‌భుత్వాన్ని క‌లిశారు. ఇక తెలంగాణాలో క‌ల‌వ‌కుండానే సినిమా ప‌రిశ్ర‌మ‌కు కె.సి.ఆర్‌. ప్ర‌భుత్వం ఆఫ‌ర్లు ఇస్తుంది.  ఈ సినిమా ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
 
ఈ విష‌యాన్ని నిర్మాతలు తెలిపారు. మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు రాధేశ్యామ్ సినిమాకు ఐదో షో ప్రదర్శించుకోవచ్చని ప్ర‌భుత్వ‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువీ క్రియేషన్స్ అధినేతలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. జాత‌కాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. రేప‌టినుంచి ప్ర‌భాస్ జాత‌కం ఎలా మారుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments