Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజుకు శ‌స్త్రచికిత్స‌

Advertiesment
Prabhas
Krishnamraju
ప్ర‌భాస్ పెద్ద‌నాన్న కృష్ణంరాజు కాలికి గాయ‌మైంద‌ని తెలుస్తోంది. స్వ‌గృహంలోనే ప్ర‌మాద‌వ‌శాత్తు కాలి మెలిప‌డ‌డంతో జారి ప‌డిపోయార‌నీ వెంట‌నే అపోలోకు తీసుకువ‌చ్చార‌ని ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం శ‌స్త్రచికిత్స‌చేసి ఎడ‌మ‌కాలి వేలిని తీసివేసిన‌ట్లు తెలుస్తోంది.


ఉమెన్స్ డే నాడు కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామలా దేవి గుడికివ‌చ్చి అర్చ‌న చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆమెను ప‌లుక‌రించిన ఓ వ్య‌క్తితో మాట్లాడుతూ, కృష్ణంరాజు కాలు జారి ప‌డిన విష‌యం వెల్ల‌డించారు కానీ స‌ర్జ‌రీ జ‌రిగిన విష‌యం తెలియ‌చేయ‌లేదు.

 
ఇప్ప‌టికే రాధేశ్యామ్ విడుద‌ల‌కు ద‌గ్గ‌ర‌బ‌డింది. ప్ర‌భాస్ అభిమానులు ఆందోళ‌న‌కు గురి అవుతార‌నే విష‌యం తెలిసి చెప్ప‌లేని తెలుస్తోంది. కృష్ణంరాజుగారు ఎప్ప‌టినుంచో త‌న నిర్మాణ సంస్థ  గోపీకృష్ణా మూవీస్ నుంచి సినిమా తీయాల‌ని చూశారు.


అది రాదేశ్యామ్ వ‌ల్ల సాధ్య‌ప‌డింది. యువి క్రియేష‌న్స్‌తో క‌లిసి ఈ సినిమా నిర్మించారు. ఇందులో ఆయ‌న వేదాంతాలు అవ‌పోస‌న ప‌ట్టిన జ్యోతిష్యుడిగా న‌టించారు. ఈనెల 11న సినిమా విడుద‌ల కాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటీకి లైన్ క్లియర్.. థియేటర్లలో రిలీజ్