Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ మూవీకి మోక్షం లభించినట్టేనా..?

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (19:04 IST)
గోపీచంద్ - బి.గోపాల్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆరడుగుల బుల్లెటు. ఇందులో గోపీచంద్ సరసన అందాల తార నయనతార నటించింది. వక్కంతం వంశీ కథ అందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. మాస్ ప్రేక్షకులే టార్గెట్‌గా రూపొందింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా 2012లో ప్రారంభమైంది. తమిళ దర్శకుడు భూపతి పాండియన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా దీన్ని ప్రారంభించారు.
 
అయితే...ఫస్ట్ ఈ మూవీకి జగన్‌మోహన్ ఐపీఎస్ అనే టైటిల్ పెట్టారు. అయితే.. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టు తెలుగు స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని నిర్మాత తాండ్ర రమేష్ పట్టుబట్టడంతో భూపతి తప్పుకున్నారు. దీంతో ఇదే ప్రాజెక్ట్‌ను వక్కంతం వంశీ ఇచ్చిన కథతో బి.గోపాల్ దర్శకత్వంలో తిరిగి ప్రారంభించారు. బి.గోపాల్ ఎంటర్ అయిన తర్వాత ఈ చిత్రానికి ఆరడుగుల బుల్లెట్ అని టైటిల్ పెట్టారు. అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటే... ఆర్థిక ఇబ్బందులతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
 
ఆ తర్వాత నిర్మాత పీవీపీ ఈ ప్రాజెక్ట్‌ను చేతులోకి తీసుకుని 9 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2017లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఫైనాన్సియర్స్ తమకు ఇవ్వాల్సిన మొత్తం కట్టాలని పట్టుబట్టడంతో మళ్లీ ఆగిపోయింది. ఇప్పుడు థియేటర్స్ అన్ని మూతపడడంతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతకు భారీ ఆఫర్ వచ్చిందని.. నిర్మాత కూడా సముఖుంగా ఉన్నారని తెలిసింది. ఇదే వాస్తవం అయితే... గోపీచంద్ ఆరడుగుల బుల్లెటుకు మోక్షం లభించినట్టే. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments