Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకి ప్రపంచ రికార్డ్‌ని బహుమతిగా అందించిన అభిమానులు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (18:57 IST)
జూన్ 10 బాలకృష్ణ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్లోబల్ నందమూరి అభిమానులు మంచి ఆలోచనతో ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరంల వేలాది అభిమానుల మధ్య జరిగే వేడుకల కాకుండా, ప్రస్తుతం Covid19 దృష్టిలో పెట్టుకొని, లాక్ డౌన్‌ని గౌరవిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న CovidHerosకి సెల్యూట్ చేస్తూ బాలయ్య అభిమానులు, మిత్రులు, ఆత్మీయులు వారివారి ఇళ్లలో, కుటుంబసభ్యులతో కలిసి జూన్10న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు విశ్వవ్యాప్తంగా ఒకే సమయంలో NBK60 కేక్ కట్ చేసి సామాజిక బాధ్యతతో జన్మదిన వేడుకలు జరిపారు.
 
ఇలా జరపడం ఇదే మొదటిసారి కావడంతో Wonder book of records మరియు GENIUS BOOK OF RECORDS వారు పర్యవేక్షించి ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక బాలకృష్ణ గారికి ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు.
 
 అలాగే ప్రపంచ వ్యాప్తంగా 21, 000 మందికి పైగా వారి ఇళ్లలో ఒకే సమయంలో కేక్ కట్ చేసి రికార్డుని సాధించామని, ఆ రోజు దాదాపు ప్రత్యేకంగా పరోక్షంగా ప్రపంచ వ్యాప్తంగా 80 వేల మందికి పైగా వేడుకల్లో పాల్గొన్నారని NBK HELPING HANDS అధినేత అనంతరం జగన్ తెలుపుతూ, అలాగే మా కుటుంబ సభ్యుడుగా భావించే మా బాలయ్య గారి 60వ పుట్టినరోజు వేడుకలు.. కుటుంబ సభ్యుల మధ్య ఇంట్లో జరుపుకోవడం ప్రతి అభిమానికి ఎన్నటికీ మర్చిపోలేని తియ్యటి జ్ఞాపకం మని, బాలయ్యా గారి మంచి మనస్సుకు, సేవగుణనికి గుర్తుగా ప్రతి ఒక్కరూ పండుగలా జరిపామని, కరోనా అందరిని ఇంట్లో నుండి బయటకు రాకుండా చేసింది కానీ మా గుండెల్లో ఉండే అభిమానాన్ని అపలేకపోయిందని తెలిపారు.
 
 
 
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... నా 60వ పుట్టినరోజుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నా అభిమానులతో పాటు, మిత్రులు,శ్రేయోభిలాషులు క్రమశిక్షణతో మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరిపి మీ సామాజిక బాధ్యత ను నాకు అపూర్వకానుకగా ఇచ్చారు, మీ ప్రేమాభిమానాన్ని ప్రపంచ రికార్డు రూపంలో అందించిన మీ అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,సామాజిక దూరం పాటించి సేవకార్యక్రమలు చేసిన వారందరికి,ఆర్గనైజింగ్ చేసిన అనంతపురం జగన్ కి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments