Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్, కావ్యా థాపర్ ల విశ్వం నుంచి సెకెండ్ సింగిల్ మొండి తల్లి పిల్ల నువ్వు రిలీజ్

డీవీ
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (18:10 IST)
Viswam-gopichand
గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా'కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ చార్ట్ బస్టర్ నోట్ లో స్టార్ట్ అయ్యాయి.
 
ఈ రోజు మేకర్స్ సెకెండ్ సింగిల్ 'మొండి తల్లి పిల్ల నువ్వు' సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.
 
'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.  
 
మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.    
 
ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె.
 దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments