Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా గుడ్ లక్ సఖి పోస్టర్

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (16:52 IST)
kerthy suresh
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను అల‌రించ‌నున్నారు. ఈ క్రమంలోనే గుడ్ లక్ సఖి సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రాబోతోన్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావ్యా వర్మ సహ నిర్మాతగా ఈ చిత్రం రాబోతోంది.
 
ఆదివారం కీర్తి సురేష్ బర్త్ డే. ఈ క్రమంలో గుడ్ లక్ సఖి టీం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. గురి చూసి కొడుతున్నట్టుగా ఉన్న కీర్తి సురేష్ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. గన్నుతో గురి చూసి కొడుతున్న కీర్తి సురేష్ అభిమానులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా నటించారు.
 
నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టు ఈ కొత్త పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. నాగేశ్ కుకునూర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకే సారి విడుదలచేయబోతోన్నారు.
 
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. చిరంతన్ దాస్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన  టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments