Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ పదునైన డైలాగ్స్.. ఊగిపోతున్న ఫ్యాన్స్ (video)

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (21:35 IST)
God Father
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్సుకు గుడ్ న్యూస్. ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార  ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. 

 
 


 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 12 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్సుకు ట్రీట్ ఇచ్చేలా చేసింది. 
God Father
 
ఈ ట్రైలర్ వీడియోలో చిరంజీవి డైలాగ్స్‌తో అదరగొట్టేశారు. తాజాగా అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఈ వీడియోలో చిరంజీవి పదునైన డైలాగ్స్ మెగా ఫ్యాన్సుకు కిక్కిస్తున్నాయి. ''నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అంటూ చిరంజీవి పవర్ ఫుల్‌గా చెప్పారు. చిరంజీవి చెప్పిన డైలాగ్ మెగా ఫ్యాన్స్‌ని హుషారెత్తేలా చేసింది. 
God Father
 
ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'హాలో బ్రదర్' అంటూ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవితో కలిసి భారీ ఫైట్ కూడా చేశాడు. సల్మాన్ ఖాన్ ముందు చంపుకుంటూ వస్తుండగా.. వెనుక నుంచి చిరంజీవి వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. 
 
ఇకపోతే.. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
God Father
 
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిరంజీవి ఇందులో 'బ్రహ్మా' క్యారెక్టర్ పోషిస్తున్నారు. విలన్ రోల్‌లో సత్యదేవ్ సరిగ్గా సెట్ అయ్యాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments