అనసూయ బయటకురావాలంటే ఇలా చేస్తుందట!
, శనివారం, 24 సెప్టెంబరు 2022 (20:33 IST)
నేను బయటికి రాకముందే నా పని చేస్తున్నానంటూ ఫొటోలను పోస్ట్ చేస్తూ అలరించింది అనసూయ భరద్వాజ్. ఆమె ఉదయమే బయటకు వెళ్ళాలంటే ఇలా అద్దం ముందు కూర్చుని మేకప్ వేసుకుని రెడీ అవుతున్నానంటూ చెబుతోంది. ఈరోజు పోస్ట్ చేసిన ఫొటోలను ఆమె భర్త భరద్వాజ్ తీశాడు. మహాతల్లి మీపై ఉన్న ఈ రూపాన్ని ప్రేమిస్తున్నాను అంటూ బరద్వాజ్ పోస్ట్ చేయడం విశేషం.
ఇప్పటికే అనసూయ సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తూ వైరల్ అయింది. ఆమధ్య లైగర్ హీరో విజయ్‌దేవరకొండ సినిమా విషయంలో తను స్పందించింది. అసలు ఆ సినిమాకూ ఆమెకు సంబంధమే లేదు. కానీ అలా ఎందుకు స్పందించిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్‌లను కొన్ని తగ్గించింది కూడా జూనియర్ సింగర్స్ పోటీలలో తను యాంకర్ వుండి అలరిస్తోంది. తాజాగా చిరంజీవి సినిమాలో ఆమె నటిస్తోంది.
తర్వాతి కథనం