Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ అంటూ "ఘాజీ"పై అగ్ర దర్శకుల ప్రశంసలు

జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న "ఘాజీ" అశేష అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు "ఘాజీ" చిత్రంపై తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (15:52 IST)
జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న "ఘాజీ" అశేష అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు "ఘాజీ" చిత్రంపై తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "ఘాజీ" చిత్రంపై ప్రముఖ దర్శకులు చేసి ట్వీట్లు.. 
 
రాజమౌళి: ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా కెప్టెన్ & క్రూ అద్భుతమైన ప్రదర్శనతో అలరించారు. రానాకి శుభాకాంక్షలు!
 
క్రిష్: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచినందుకు, ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించినందుకు "ఘాజీ" చిత్ర బృందానికి రానాకి నా ధన్యవాదాలు. 
 
కొరటాల శివ: "ఘాజీ" చిత్రాన్ని చూస్తున్నంతసేపూ ఒక అపురూపమైన అనుభూతికి లోనయ్యాను. దర్శకుడు సంకల్ప్ అండ్ టీం చాలా ఎఫెర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్‌గా రానా సబ్ మెరైన్‌ను ఎంత చాకచక్యంతో నడిపించాడో దర్శకుడు అంతకుమించిన నేర్పుతో చిత్రాన్ని తెరకెక్కించాడు. కథను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు నా శుభాకాంక్షలు. నా స్నేహితుడు మధి సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా మెచ్చుకొని తీరాలి. 
 
వంశీ పైడిపల్లి: దర్శకుడు సంకల్ప్‌కి ఈ చిత్రం బ్రిలియంట్ డెబ్యూ, అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం "ఘాజీ". 
 
వీరితోపాటు దర్శకులు తేజ, మారుతి, నటి సమంత, హీరో నాగ చైతన్య వంటి పలువురు చిత్ర ప్రముఖులు కూడా "ఘాజీ" చిత్రాన్ని, చిత్ర బృందాన్ని అభినందించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Girl Reels At Alipiri మోడ్రన్ దుస్తుల్లో కిస్సిక్ పాటకు రీల్.. సారీ చెప్పిన యువతి

YS Sharmila Sensational Comments జగన్ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు డబ్బులు అందాయా?

భూకంపం: ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా ప్రాంతమంతా సేఫ్ జోన్‌లోనే’

ఎగిరే చేపలు.. తిమింగలం, గరుడ పక్షి నుంచి తప్పించుకుని.. (video)

"ఫ్యూచర్ సిటీ" కోసం.. 30వేల ఎకరాల భూమిని సేకరించాలి: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments