Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి స్పూర్తితో సినిమా చేశానంటున్న జీఎఫ్ హీరో

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (21:45 IST)
``చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన స్ఫూర్తితోనే హీరోగా మారాను. ''జీఎఫ్'' మూవీలో యాక్షన్, రొమాన్స్, ఎంటర్టైన్‌మెంట్ లాంటివి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. తండ్రి కూతురు మధ్య ఉండే చెప్పలేనంత ప్రేమ మా సినిమాలో చూస్తారు. ఫాదర్ సెంటిమెంట్, ఎమోషన్‌తో ప్రధానంగా సినిమా సాగుతుంది. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు ''జీఎఫ్'' సినిమాను తీసుకొస్తాం. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా`` అన్నాడు చిరంజీవి కుంచాల.
 
ఆయ‌న‌ నటిస్తున్న కొత్త సినిమా ''జీఎఫ్''. వైదేహి శర్మ, అస్మా మిర్జా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను భారతి క్రియేషన్స్, కేథరీన్ ఫిల్మ్ మేకర్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతి కుంచాల, వెంకట్ కృష్ణ కుంచాల నిర్మాతలు. ద‌ర్శ‌కుడు కూడా చిరంజీవి కుంచాల. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వైఎస్ఆర్ సీపీ నాయకులు వెంకట్ రెడ్డి, టీఎమ్మార్పీఎస్ నేత ఇటుక రాజు మాదిగ, మాల మహానాడు నాయకులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
 
మాల మహానాడు నాయకులు చెన్నయ్య మాట్లాడుతూ.. మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉంది. పాటలు వినాలనిపించేలా ఉన్నాయి. ఈ సినిమా గుడ్ ఫిల్మ్‌గా, గ్రేట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకోవాలని ఇతర అతిథులు ఆకాంక్షించారు.
 
ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ - కళ్యాణ్, కొరియోగ్రఫీ - వెంకట్ దీప్, సినిమాటోగ్రఫీ - వల్లి, ఎడిటర్ - ఎంఎన్ఆర్, సంగీతం - యూవీ నిరంజన్, స్టంట్స్ - షావోలిన్ మల్లేష్, నిర్మాతలు - భారతి కుంచాల, వెంకట్ కుంచాల, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం - చిరంజీవి కుంచాల.

సంబంధిత వార్తలు

Telangana Lok Sabha Election results 2024 Live: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు 2024

త్రివర్ణ పతాకంతో 'మా తుజే సలామ్' అంటూ గుండెపోటుతో నేలకొరిగిన రిటైర్డ్ సైనికుడు (video)

తెలంగాణలో టీటీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి? చంద్రబాబు ప్లాన్?

అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ సాహిల్ అరెస్ట్

కడప ఎన్నికల కౌంటింగ్.. 53మంది రౌడీ షీటర్లపై చర్యలు.. ఈసీ సీరియస్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

మామిడి పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments