Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 కోట్ల క్లబ్‌లో 'గీత గోవిందం' - 12 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్...

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రం ఈనెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల వర

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (15:13 IST)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "గీత గోవిందం". ఈ చిత్రం ఈనెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం గత 12 రోజుల్లో సుమారుగా 50 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
 
ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటిన 23వ టాలీవుడ్ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే, ఆల్ టైమ్ టాప్ 20 లిస్టులో ప్రస్తుతం ఈ చిత్రం 19వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ బాగా ఉండటంతో త్వరలోనే 60 కోట్ల రూపాయలను వసూలు చేసి టాప్ 15 స్థానానికి చేరుకోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, గత 12 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన షేర్స్ వివరాలను పరిసీలిస్తే, నిజాం రూ.15.24 కోట్లు, సీడెడ్ రూ.5.65 కోట్లు, యూఏ రూ.4.15 కోట్లు, గుంటూరు రూ.2.93 కోట్లు, ఈస్ట్ రూ.2.90 కోట్లు, వెస్ట్ రూ.2.33 కోట్లు, కృష్ణా రూ.2.84 కోట్లు, నెల్లూరు రూ.1.14 కోట్లు చొప్పున ఉన్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం ఇప్పటివరకు మొత్తం రూ.37.18 కోట్లను వసూలు చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.6.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9.60 కోట్లతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.52.98 కోట్ల మేరకు వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments