Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతారామంలో మేజర్ సెల్వన్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్‌

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (17:07 IST)
Gautham Vasudev Menon
క్లాస్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వౌదేవ్ మీనన్, హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సీతారామం'లో మేజర్ సెల్వన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రని పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో సీరియస్‌గా లుక్ లో కనిపించి క్యురియాసిటీని పెంచారు. గౌతమ్ మీనన్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా నిలిచారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ మేజర్ సెల్వన్ లుక్ ని వివరంగా చూపించింది.  
 
సినిమాలో నటీనటులందరూ కథలో కీలక భూమిక పోషించనున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దృశ్యకావ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు చూడటం ప్రేక్షకులకు కన్నులపండగ కాబోతుంది.  
 
పాటలు, టీజర్, నటీనటుల పరిచయ వీడియోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ పై భారీ ఆసక్తి నెలకొంది.
 
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
 
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments