Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమి పుత్ర శాతకర్ణి' బంపర్ హిట్.. తెరపై అమ్మ పేరు గర్వంగా ఉంది.. క్రిష్

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అలరించిన ఏకైక వ్యక్తి బాలకృ

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (19:55 IST)
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది.  పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో అలరించిన ఏకైక వ్యక్తి బాలకృష్ణ శాతకర్ణిగా అలరించాడు. ఇక తెలుగు వారి ఆత్మగౌరాన్ని దశదిశలా చాటిచెప్పిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి. అలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణీ' బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలు రాయి అవుతుందని సినీ పండితులు చెప్తున్నారు. శాతకర్ణి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 
 
బాలయ్య అసమాన నటన క్రిష్ దర్శకత్వ ప్రతిభ వెరసి శాతకర్ణి చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందింది. బుధవారమంతా మెగా ఫీవర్‌తో వేడెక్కిపోయిన తెలుగు రాష్ట్రాలు, గురువారం 'గౌతమిపుత్ర శాతకర్ణి' మాయలో పడిపోయాయి. బాలయ్య ఫ్యాన్స్‌కు ఈ సినిమా బిగ్ ట్రీట్‌గా నిలిచింది. విదేశాల్లో కూడా బాలయ్య అభిమానులు ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.
 
శాతకర్ణి రూపకల్పన వెనుక క్రిష్ శ్రమ, పట్టుదలే ఎక్కువగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమ తపన ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. శాతకర్ణి గురించి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. దాంతో ఎవరికి తెలియని కథను, ఎలాంటి వివాదాలు, అభ్యంతరాలకు తావు లేకుండా హీరోయిజాన్ని ఆవిష్కరిస్తూ సినిమాను రూపొందించారు. 
 
ఇకపోతే, తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా తీయడం ఆనందంగా ఉందని గౌతమిపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్‌ అన్నారు. హైదరాబాద్‌లో కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తోటి దర్శకుల నుంచి అభినందనలు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి తన సంతకం అంజనాపుత్ర క్రిష్‌ అని చేసిన ఆయన.. ఈ సినిమా ద్వారా తన తల్లి పేరు తెరపై చూడటం గర్వంగా ఉందని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments