Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమీపుత్ర శాతకర్ణి ఎఫెక్ట్.. క్రిష్‌కు చరణ్ ''రాయబారం''..

టాలీవుడ్‌లో ప్రస్తుతం సంక్రాంతి వార్ నడుస్తోంది. టాప్ హీరో సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదలైతే.. కలక్షన్స్ రికార్డులపై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోయినట్లే అని బాలకృష్ణ అభిమానుల అభిప్రాయం. దీనితో మంచి సిన

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (19:26 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం సంక్రాంతి వార్ నడుస్తోంది. టాప్ హీరో సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదలైతే.. కలక్షన్స్ రికార్డులపై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోయినట్లే అని బాలకృష్ణ అభిమానుల అభిప్రాయం. దీనితో మంచి సినిమా అన్న పేరు 'శాతకర్ణి' కి రికార్డులు 'ఖైదీ' కి మిగులుతాయేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే క్రిష్.. చెర్రీతో ఓ రహస్య సమావేశం జరిగిందని తెలుస్తోంది. 
 
చిరంజీవి 151వ సినిమాకు సంబంధించి ఒక మంచి కథను ఆలోచించమని చరణ్ క్రిష్‌ను కోరినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. ఒకవైపు చిరంజీవి 151వ సినిమాకు సంబంధించి బోయపాటి సురేంద్ర రెడ్డిల పేర్లు మెగా కాంపౌండ్ తీవ్రంగా పరిశీలిస్తూ ఉన్నా వ్యూహాత్మకంగా క్రిష్‌ను కూడ ఈ లిస్టులో మెగా కాంపౌండ్ చేర్చింది. గౌతమి పుత్ర శాతకర్ణితో క్రిష్ క్రేజ్ భారీగా పెరగడంతో చిరంజీవి కూడా క్రిష్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కంచె సినిమా తర్వాత వరుణ్ తేజ్‌తోనే సినిమా చేసేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకే రాయబారి అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. కానీ ప్రస్తుతం వరుణ్ రాయబారి కాస్త చరణ్‌కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. శాతకర్ణి చిత్రం ఎఫెక్టుతో క్రిష్ దర్శకత్వంలో చెర్రీ సినిమా చేయాలని ముచ్చట పడుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్న చెర్రీ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రాయబారిగా వస్తాడేమో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments