Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమీపుత్ర శాతకర్ణి.. ఆ అమ్మాయి కోసం లేచి నిలబడ్డాడు.. ఎందుకో తెలిస్తే?

నందమూరి వారసుడు బాలయ్య వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు జాగర్లమూడి క్రిష్, హీరో బాలయ్య 'శాతకర్ణి' షో చూసేందుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్ల

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (18:03 IST)
నందమూరి వారసుడు బాలయ్య  వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు జాగర్లమూడి క్రిష్, హీరో బాలయ్య 'శాతకర్ణి' షో చూసేందుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భ్రమరాంబిక థియేటర్‌కు వెళ్లారు. ప్రేక్షకులతో కలసి ఈ సినిమా చూసేందుకు బాలయ్య భ్రమరాంబిక థియేటర్‌కు విచ్చేశారు. 
 
ఇక బాలయ్య రాగానే అభిమానులంతా 'జై బాలయ్య' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 'దేశం మీసం తిప్పుదాం' అంటూ అభిమానులంతా సినిమాలోని డైలాగులను అరిచిమరీ చెప్పారు. బాలయ్య థియేటర్‌లోకి రావడం.. అభిమానులందరినీ పలకరించి విక్టరీ సింబల్ చూపించడం.. అనంతరం క్రిష్ పక్కన ఆసీనులవడం అన్నీ జరిగిపోయాయి. అయితే కొద్ది సేపటికి ఓ యువతి.. బాలయ్యకు తాను వీరాభిమాని అని, బాలయ్యతో ఫొటో దిగాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నానని బాలయ్య సెక్యురిటీతో చెప్పింది. అంతే సెక్యూరిటీ బాలయ్యకు చెప్పారు. 
 
సెక్యూరిటీ చెప్పగానే ఆ అమ్మాయి కోసం బాలయ్య సీటు నుంచి లేచి ఆమెతో ఫోటో దిగారు. ఈ ఘటన ఆడపడుచులంటే నందమూరి కుటుంబానికి ఉన్న గౌరవాభిమానానికి నిదర్శనమని ఓ అభిమాని తెలిపాడు. ఆమెతో  ఫొటోలు తీసుకున్నాక బాలయ్య మళ్లీ సీటులో ఆసీనులయ్యారు. ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడున్న బాలయ్య అభిమాని ఒకరు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments