Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరింది.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:36 IST)
యూట్యూబ్ స్టార్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న గంగవ్వ ఎన్నో వీడియోల ద్వారా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ ఫాలోయింగ్ ద్వారా ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌‌లోకి అడుగుపెట్టింది.
 
అయితే బిగ్ బాస్ హౌస్‌లో అనారోగ్య కారణంగా కొన్ని వారాలకి హౌస్ నుంచి బయటకు వచ్చింది. అయితే తనకు ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదని ఒకానొక సందర్భంలో తెలియజేయడంతో ఆమె కోసం ఇంటిని నిర్మించే బాధ్యతను బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున తన భుజాలపై వేసుకున్నారు.
 
ఇలా గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే గృహ ప్రవేశం చేయడంతో ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి. ఎట్టకేలకు గంగవ్వ సొంత ఇంటి కల నెరవేరడంతో చాలామంది గంగవ్వకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
ఇక ఈ ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం బిగ్ బాస్ ద్వారా రూ.11 లక్షలను గెలుచుకున్న గంగవ్వ ఆ తర్వాత నాగార్జున 7లక్షల సహాయం చేశారు. ఇక మిగిలిన మూడు లక్షల అప్పు చేసి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. 
 
ఈ క్రమంలోనే ప్రస్తుతం గంగవ్వ కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరింకెందుకాలస్యం గంగవ్వ కొత్తింటి ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. ఇక గంగవరం నూతన గృహప్రవేశానికి ఫేమ్‌ అఖిల్‌, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments