Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

డీవీ
గురువారం, 31 అక్టోబరు 2024 (17:21 IST)
Game changer teaser poster
దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కొద్దిసేపటి క్రితమే చిత్ర దర్శక నిర్మాతలు గేమ్ ఛేంజర్ టీజర్, విడుదల అప్ డేట్ ను ప్రకటించారు. రామ్ చరణ్ అందరికీ దీపావళి విషెస్ చెబుతూ, నవంబర్  9న టీజర్ ను, జనవరి 10న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ తో కూడిన ఈ పోస్టర్ రెండో రామ్ చరణ్ పాత్రను రిలీవ్ చేసినట్లయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. 
 
దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను సరికొత్త కోణంలో ఆవిష్కరించారని తెలుస్తోంది. ఇప్పటికే   చిత్రం నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్. భారీ రేటుకే నార్త్‌లో గేమ్ చేంజర్ అమ్ముడైపోయింది.
 
కథ ప్రకారంగా చూసుకుంటే ఇందులో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. కియారా అద్వానీ కథానాయికగా, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఎడిటింగ్‌ను బాధ్యతను ప్రఖ్యాత ద్వయం షమ్మర్ ముహమ్మద్, రూబెన్ నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments