Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న "గద్దలకొండ గణేశ్".. కలెక్షన్ల వర్షం

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (15:24 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం "గద్దలకొండ గణేష్" (వాల్మీకి). ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించింది. 
 
ఈ చిత్రం విడుదైలన ప్రతిచోటా మంచి టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లు రాబడుతోంది. తొలి 3 రోజుల్లో ఈ సినిమా రూ.13.4 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. తొలి 3 రోజుల వసూళ్ల విషయంలో వరుణ్ తేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా గద్దలకొండ గణేష్ నిలించింది. 
 
గతంలో వరుణ్ తేజ్ నటించి సూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'కంచి', 'ఫిదా', 'తొలిప్రేమ' వంటి చిత్రాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రాలు కలెక్షన్ల పరంగా తక్కువ. కానీ, గద్దలకొండ గణేష్ చిత్రం మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
వరుణ్ తేజ్ మాస్ లుక్‌తో అద్భుతమైన నటనకు పూజా హెగ్డే గ్లామర్, ఆకట్టుకునే వినోదం, పాటల కారణంగా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'సైరా' విడుదలయ్యే వరకూ 'గద్దలకొండ గణేశ్'కి పోటీగా నిలిచే సినిమాలేమీ లేకపోవడంతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments