Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ ఇంకా నాలుగు భాగాలున్నాయంటున్న వర్మ

Webdunia
శనివారం, 25 జులై 2020 (21:56 IST)
నేను ఒక సినిమా ఇండస్ట్రీ. నన్ను తెలుగు సినిమా పరిశ్రమ వెలివేయడమేమిటి. నేను సలహాలు తీసుకోను.. ఎవరికి సలహాలు ఇవ్వను. ఎవరో నలుగురు వచ్చి నా ఆఫీస్ మీద దాడి చేస్తే భయపడిపోతానా. కుక్క మొరిగితే భయపడిపోతాను. ఇలా ఎవరు చెబుతారో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆర్.జి.వి.
 
రాంగోపాల్ వర్మ ఇప్పుడు పవర్ స్టార్ సినిమాను ఆన్ లైన్లో రిలీజ్ చేసి సినిమా పరిశ్రమలో పెద్ద చర్చను లేవనెత్తారు. ఆన్లైన్ లో మొదటిసారి సినిమాను రిలీజ్ చేయడంతో ఆ సినిమా కాస్త రెస్పాన్స్ అద్భుతంగా వస్తోందని చెబుతున్నారు. ప్రముఖులపై సినిమాలు తీయడం.. సెటైర్లు వేయడం ఇదంతా వర్మకు అలవాటే.
 
వర్మ అంటేనే ఒక వెరైటీ. ఇది అందరూ చెప్పే మాటే. అయితే పవర్ స్టార్ సినిమాలో పవన్ కళ్యాణ్ గురించే అంతా ఉంది కానీ.. ఎక్కడా విమర్సలు మాత్రం లేవు. కానీ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉండి ఎవరితో కలవకుండా ఉంటేనే గెలుస్తాడు.. సిఎం అవుతాడు అని కూడా సినిమాలో చూపించారు వర్మ. 
 
నేను పవన్ కళ్యాణ్‌కు అభిమానిని. అయితే నేను చేసింది పవర్ స్టార్ సినిమా. సినిమా చూడొద్దని కొందరు చెబుతున్నారు. ఇష్టమొచ్చిన వారు చూస్తారు. మిగిలిన వారు పట్టించుకోరు అంతేగానీ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారని నేను భయపడను. నేను నడుపుతున్నది ఆర్.జి.వి.ఇండస్ట్రీ. ఇది ప్రత్యేకం. తెలుగు సినీపరిశ్రమలతో నాకు సంబంధం లేదంటున్నారు రామ్ గోపాల్ వర్మ.
 
27 నిమిషాల పాటు నిడివిగల సినిమాను తీశారు ఆర్.జి.వి. పవర్ స్టార్ మొదటి భాగం మాత్రమేనని. ఇంకా నాలుగు భాగాలు ఉన్నాయని చెబుతున్నాడు. మరోవైపు ఆర్.జి.వి.పై సెటైర్లు వేస్తూ నూతన నాయుడు దర్సకత్వంలో పరాన్నజీవి అనే సినిమా తెరకెక్కింది. రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలపైనే తెలుగుసినీపరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments