తెలుగు చిత్రపరిశ్రమలో మరో హాట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ రాపాక. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన "మర్డర్" చిత్రం ద్వారా ఈమె మంచి పాపులర్ అయింది. ఈమె తాజాగా ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ.. తనకున్న ఆస్తి నా బాడీ అందాలేనని, వాటిని దర్శకుడు ఆలోచనకు అనుగుణంగా చూపిస్తే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందిస్తూ, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందన్నారు. అయితే, తనకు మాత్రం అలాంటి అనుభవం ఎదురుకాలేదన్నారు. పైపెచ్చు.. మనం నడుకునే తీరులోనే అడ్డంకులు ఎదురవుతాయన్నారు. ఒక వ్యక్తి నుంచి సమస్యలు ఉంటే.. అతనికి దూరంగా జరిగి మరో మార్గంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే క్యాస్టింగ్ కౌచ్ బారినపడబోమన్నారు. తాను అలానే చేస్తూ వచ్చినట్టు తెలిపారు.
అయితే, ఉత్తరాది అమ్మాయిలు అలా కాదన్నారు. వారు ముందుగానే కమిట్ అయి వస్తారన్నారు. అందుకే పూర్తిస్థాయిలో ఎక్స్‌పోజింగ్ చేయమని దర్శకుడు అడగ్గానే అందరిముందూ పబ్లిగ్గా అన్నీ చూపిస్తారన్నారు. ఇందులో తప్పేలేదన్నారు. ఎందుకంటే వారి ఆస్తి వారి బాడీ అందాలేనని చెప్పుకొచ్చారు. దర్శకుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగా అందాలు ప్రదర్శించడం తప్పేలేదని, ఆ విధంగానే తాను మర్డర్ చిత్రంలో తన అందాలను ప్రదర్శించినట్టు శ్రీ రాపాక చెప్పుకొచ్చింది.
కాగా, 2007లో అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" చిత్రంలో ఫ్యాషన్ డిజైనరుగా తన కెరీర్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తాను క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కోలేదన్నారు. అలాగే, తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చింది పూరీ జగన్నాథ్ అని చెప్పారు.
హీరో రవితేజతో కూడా కలిసి పనిచేసినట్టు చెప్పారు. ఇకపోతే "మర్డర్" చిత్రం పూర్తిగా కమర్షియల్ అని, టీనేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని నిర్మించారన్నారు. కుర్రకారుతో పాటు భార్యాభర్తలు కలిసి ఈ చిత్రాన్ని చూడొచ్చని శ్రీరాపాక చెప్పుకొచ్చారు.