ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (22:14 IST)
సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఈ ట్రస్టుకు విదేశీ విరాళాలు స్వీకరించేందుకు కేంద్రం హోం శాఖ అనుమతి ఇచ్చింది. విదేశీ విరాళాలు స్వీకరించేందుకు ట్రస్టుకు వీలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. 
 
ఛారిటబుల్‌ ట్రస్టు కింద బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 కింద నమోదు చేసుకుని ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి తీసుకోవాలని ఇటీవల నిబంధనల్లో మార్పు చేశారు. నిబంధనల మార్పుతో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కేంద్రం అనుమతి కోరింది. 
 
ట్రస్టు విజ్ఞప్తికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆమోద ముద్రవేశారు. దీంతో విదేశాల్లో ఉండే ప్రవాస భారతీయులతో పాటు ఇతర విదేశీ స్వచ్చంద సేవా సంస్థలు కూడా ఈ ట్రస్ట్‌కు విరాళాలు అందించే వెసులుబాటు కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments