Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ లిస్టులో పవన్ కల్యాణ్-ప్రభాస్‌కు నో ప్లేస్.. అల్లు అర్జున్-మహేష్ బాబులకు చోటు..

ప్రముఖ ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అగ్రస్థానం లభించగా, రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడు. అలాగే ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో మన టాల

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (15:39 IST)
ప్రముఖ ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అగ్రస్థానం లభించగా, రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడు. అలాగే ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో మన టాలీవుడ్ సెలబ్రిటీస్‌కి కూడా స్థానం దక్కింది.

ఈ క్రమంలో శ్రీమంతుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 33వ స్థానంలో ఉండగా, అల్లు అర్జున్ 43 స్థానంతో సరిపెట్టుకున్నాడు. అదే ఫేం ర్యాంక్ పరంగా చూసుకుంటే అల్లు అర్జున్ 59వ స్థానంలో ఉండగా మహేష్ 74వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఎన్టీఆర్ (89), చెర్రీ (86) స్థానాల్లో నిలిచారు. 
 
హీరోయిన్ల సంగతికి వస్తే శ్రీమంతుడు హీరోయిన్ శ్రుతి హాసన్ 34వ స్థానంలో నిలిస్తే, కాజల్ అగర్వాల్ 37వ స్థానాన్ని కైవసం చేసుతుంది. ఈ ఫోర్బ్స్ ర్యాంకు ప్రకారం చూస్తే అల్లు అర్జునే టాప్‌లో ఉన్నాడు. ఇక బాహుబలితో గత ఏడాది ఫోర్బ్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ప్రభాస్ ఈ ఏడాది వందలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకోలేకపోయాడు. 
 
టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చెర్రీలకు టాప్-100లో స్థానం లభిస్తే, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల పేర్లు ఆ జాబితాలో కనిపించకపోవడంపై సినీ జనం షాక్ అవుతున్నారు. ఫోర్బ్స్ అందించిన సమాచారం ప్రకారం ఆదాయం, కీర్తి, గూగుల్ ర్యాంకింగ్స్, పత్రికల కవర్ పేజీ లాంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రముఖులను ఎంపిక చేస్తారు. 
 
అయితే ముఖ్యంగా ఆదాయంలో గానీ, రాజకీయాల్లో గానీ, ఫ్యాన్ ఫాలోయింగ్‌లో గానీ కీలకంగా ఉన్న పవర్ స్టార్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ , మరో ముఖ్యమైన హీరో, బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రభాస్‌కు ఫోర్బ్స్ జాబితాలో స్థానం లభించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments