Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

దేవీ
సోమవారం, 23 జూన్ 2025 (11:08 IST)
Ghati Lo Folk Song
అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్స్ సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది. ఘాటిని UV క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది.
 
మేకర్స్ తాజాగా జానపద ఊపుతో నిండిన పాట "సైలోరే" సాంగ్ ని విడుదల చేశారు. ఇది ఓ ఎనర్జిటిక్ బ్లాస్టర్‌లా ఉంది. ప్రకృతిసౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్‌లో లీడ్ పెయిర్ ఉత్సవంగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అనుష్క, విక్రమ్‌ కొత్తగా పెళ్లి అయిన జంటగా సంగీతం, నృత్యం, సాంస్కృతిక వెలుగులతో చుట్టూ ఉంటూ అడవిని రంగుల విందుగా, మేళా తాళాలతో, భావోద్వేగాలతో నింపారు.
 
నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచిన ఈ మనసును తాకే పాట జానపదపు స్వరాలను భావోద్వేగాలకు మిళితం చేస్తూ అద్భుతంగా వుంది. కృష్ణ రాసిన సాహిత్యం హుషారు వుంది. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించిన ఈ పాట ఉత్సవాన్ని మరింత పెంచింది. రాజు సుందరం కోరోయోగ్రఫీ అద్భుతంగా వుంది.
 
ఈ సినిమాకి మనోజ్ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. సాయి మాధవ్ బుర్రా మాటలు రాశారు.
 
ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా విడుదల అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments