వరుణ్ తేజ్ తన మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ 'మట్కా'తో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి మూవీని మ్యాసీవ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈరోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇది వరుణ్ తేజ్‌ను యంగ్ స్టర్, అండ్ మిడిల్ ఏజ్ మ్యాన్ గా రెండు డిఫరెంట్ అవతార్స్ లో ప్రజెంట్ చేసింది. సినిమాలో నాలుగు డిఫరెంట్ గెటప్‌లలో హీరో 24 ఏళ్ల జర్నీని అద్భుతంగా చూపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అండర్‌డాగ్ నుంచి ఓవర్‌లార్డ్ వరకు రెండు షేడ్‌లు కనిపిస్తున్నాయి. అతను తన టెరిటరీకి రాజుగా ఎదుగుతాడు.
సిగార్ తాగుతూ ఇంటెన్స్ గా కనిపించిన హీరో డౌన్ ఇమేజ్‌లో యూత్, డాషింగ్‌గా కనిపించారు. అతని డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ వింటేజ్ వైబ్ లో అదిరిపోయాయి. రెండు లుక్స్ రిచ్ అండ్ స్టయిలీష్ గా వున్నాయి. తన టేబుల్ మీద తుపాకీ ఉంది. ప్లే కార్డులలో కింగ్ కార్డ్ బ్యాక్ డ్రాప్ గా వుంది. వరుణ్ తేజ్ డిఫరెంట్ షెడ్స్ లో కనిపించిన ఈ ఫస్ట్ లుక్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీ పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.