ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

దేవీ
సోమవారం, 24 నవంబరు 2025 (18:37 IST)
Rakshana Induchudan First Look
రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ద్రౌపది 2. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రూపొందుతోంది.
 
ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని తెలుస్తోంది.
 
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఫిలిప్ ఆర్ సుందర్ కెమెరామెన్‌గా, దేవరాజ్ ఎస్ ఎడిటర్‌గా, ఎస్ కే ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక పోరాట సన్నివేశాల్ని యాక్షన్ సంతోష్ భారీ ఎత్తున కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments