Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ లాల్, లిజో జోస్ పెల్లిసెరీల మలైకొట్టై వలిబన్ ఫస్ట్ లుక్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (10:59 IST)
First look of Malaikottai Valiban
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం 'మలైకొట్టై వలిబన్' (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గిరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం.  విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ లో మోహన్ లాల్ ఇంటెన్స్ లుక్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు.

ఈ సీన్ తెరపై చూస్తున్నప్పుడు ఎంత ఉత్కంఠగా ఉండనుందో ఈ ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ బ్యానర్ల పై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ లు నిర్మాతలు గా సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జనవరి 18న రాజస్థాన్ లోని జై సల్మెర్ లో ప్రారంభమైన షూటింగ్ అక్కడే కొనసాగుతోంది. 
 
ఎన్నో అంచనాలున్న ఈ చిత్రం గురించి ప్రేక్షకులు చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ చిత్ర కథ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉండగా అవేవీ ' మలైకొట్టై వలిబన్' కు సంబంధించినవి కావని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం మలయాళం తో పాటుగా ఇతర ప్రముఖ భాషలన్నిటిలో విడుదల కానుంది. మధు నీలకందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి పి ఎస్ రఫిక్ స్క్రిప్ట్ వర్క్ అందిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా, దీపు జోసెఫ్ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతీష్ శేఖర్ పి ఆర్ ఓ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తెలుగు పబ్లిసిస్ట్ గా బి ఏ రాజు 's టీం పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments