Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) కోసం కలిసి వస్తున్న ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన బిగ్గెస్ట్ స్టార్స్

Advertiesment
Akil-bony kapoor
, సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (09:29 IST)
Akil-bony kapoor
దేశంలోనే అతిపెద్ద స్పోర్టైన్‌మెంట్ ఈవెంట్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)  సందడి మళ్ళీ మొదలుకాబోతుంది. మన దేశంలో వినోదం కు రెండు ప్రధాన వనరులైన స్పోర్ట్స్, మూవీ.. ఈ రెండింటి యొక్క ప్రత్యేక కలయిక సిసియల్. యావత్ దేశం ద్రుష్టిని ఆకర్షిస్తూ ఈ సీజన్ లో  8 వివిధ ప్రాంతాల నుండి జట్లు పోటీపడతాయి. రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్, త్రివేండ్రం,  జైపూర్ సహా ఆరు నగరాలు 19 గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రతిష్టాత్మక CCL కప్ క్రింది జట్ల మధ్య జరుగుతుంది.
 
webdunia
Celebrity Cricket League
సల్మాన్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ కెప్టెన్‌గా ముంబై హీరోస్‌..  ఆర్య కెప్టన్ గా చెన్నై రైనోస్‌, వెంకటేష్‌ కో ఓనర్- అఖిల్‌ కెప్టన్ గా  తెలుగు వారియర్స్‌, మనోజ్‌ తివారీ కెప్టెన్‌గా భోజ్‌పురి దబాంగ్స్,  మోహన్ లాల్ కో ఓనర్ గా కుంచాకో బోపన్‌ కెప్టెన్‌గా కేరళ స్ట్రైకర్స్, బోనీ కపూర్‌తో ఓనర్‌గా  జిసుసేన్ గుప్తా కెప్టన్ గా బెంగాల్ టైగర్స్, సుదీప్‌ కెప్టెన్‌గా కర్ణాటక బుల్డోజర్స్, సోనూసూద్‌ కెప్టన్ గా పంజాబ్ దే షేర్.
 
లీగ్‌లో 120 మందికి పైగా సినీ ప్రముఖులు పాల్గొంటున్నందున  ఈ సీజన్ ప్రేక్షకులకు చాలా ఉత్సాహంగా వుండబోతుంది.  బెంగుళూరు, హైదరాబాద్ , చెన్నై వంటి స్టేడియాలు మునుపటి సీజన్‌లలో ప్రేక్షకులు పూర్తిగా హాజరయారు. ఈ సీజన్ లో మిగతా లోకేషన్స్ లో కూడా ప్రేక్షకులు ఉత్సాహంగా చూడబోతున్నారు.
 
7 వేర్వేరు ZEE టీవీ నెట్‌వర్క్‌లలో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జీ అన్మోల్ సినిమా మొత్తం 19 CCL గేమ్‌లను ప్రసారం చేస్తుంది.  ముంబై హీరోల మ్యాచ్‌లు  పిక్చర్స్ హిందీలో, పంజాబ్ దే షేర్ మ్యాచ్‌లు పీటీసి పంజాబీలో, తెలుగు వారియర్స్ మ్యాచ్‌లు జీ సినిమాలులో, చెన్నై రైనోస్ మ్యాచ్‌లు జీ తిరైలో, జీ బంగ్లాలో కర్ణాటక బుల్డోజర్స్, భోజ్‌పురి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్ మ్యాచ్‌లు,  కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్‌లు ఫ్లవర్స్ టీవీలో ప్రసారం కానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 3న "బిగ్ స్నేక్ కింగ్" రిలీజ్