Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో లాంఛనంగా ప్రారంభమైన సంధిగ్దం (video)

Advertiesment
Sandidga opening
, బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (16:00 IST)
Sandidga opening
సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో అతిథిగా నటిస్తున్న చిత్రం సంధిగ్దం. నిహాల్, సంధ్య, అర్జున్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటిస్తునున్నారు. తీర్థ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తీర్థ నిర్మాత. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు పార్థసారది కొమ్మోజు రూపొందిస్తున్నారు. బుధవారం సంధిగ్దం సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. భాజపా నేత పద్మ వీరపనేని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె ముహూర్తపు సన్నివేశానికి దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. పొలిటికల్ లీడర్ రమేష్ గుజ్జా, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్ స్క్రిప్ట్ ను దర్శకుడు పార్థసారధి కొమ్మోజుకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు పార్థసారది కొమ్మోజు మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిస్తున్నాం. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి టెక్నికల్ టీమ్ దొరికింది. యంగ్, టాలెంటెడ్ ఆర్టిస్టులను తీసుకున్నాం. మా సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇది సినిమాకు హైలైట్ అవుతుంది. ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రీఫీ - నందన్ కృష్ణ. జి, సంగీతం - సోయం, భాను ప్రసాద్, మీడియా పార్టనర్ - కీర్తన క్రియేషన్స్ ప్రై.లి, నిర్మాత - తీర్థ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - మధు, కథ, స్క్రీన్ ప్లే,  దర్శకత్వం - పార్థసారది కొమ్మోజు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తారకరత్న ఆరోగ్యం గురించి నేను చెప్పేదికాదు : కళ్యాణ్‌ రామ్‌