Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహానటి స్పూర్తితోనే విజ‌యానంద్ బయోపిక్ : రిషికా శర్మ

Advertiesment
Rishika Sharma, Dr. Anand Shankeshwar, Nihal Rajput
, సోమవారం, 28 నవంబరు 2022 (09:30 IST)
Rishika Sharma, Dr. Anand Shankeshwar, Nihal Rajput
వీఆర్ఎల్ వెహిక‌ల్స్ కంపెనీకంపెనీ వ్య‌వ‌స్థాకుడు, ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’. వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డా.ఆనంద్ శంకేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ‘విజయానంద్’. విజయానంద్ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నిహాల్ రాజ్‌పుత్ పోషించారు. విజ‌య్ శంకేశ్వ‌ర్ తండ్రి పాత్ర బి.జి.శంకేశ్వ‌ర్‌గా ప్ర‌ముఖ న‌టుడు అనంత నాగ్ న‌టించారు. రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా డిసెంబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.
 
రిషికా శర్మ మాట్లాడుతూ.. 'రెండున్నరేళ్ల క్రితం మా ఈ ప్రయాణం మొదలైంది. మా నిర్మాత ఆనంద్ శంకేశ్వర్ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది. నాకు ఈ సినిమాను డైరెక్టర్ చేసే చాన్స్ ఇచ్చిన పద్మశ్రీ విజయ్ శంకేశ్వర్‌ గారికి థాంక్స్. బయోపిక్స్‌లో మహానటి వంటి చిత్రం మళ్లీ రాదు. ఆ సినిమా స్పూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించాం. లలితమ్మ పాత్రను కూడా అందులోంచి స్పూర్తిగా తీసుకున్నదే. ఈ ట్రైలర్‌ను కూడా తెలుగు సినిమాలను దృష్టిలో పెట్టుకునే కట్ చేశాం. నిహాల్ ఐడియా వల్లే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. డిసెంబర్ 9న మా చిత్రం రాబోతోంది. గోపీ సుందర్ గారే ఈ సినిమాకు బ్యాక్ బోన్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.
 
హీరో నిహాల్ మాట్లాడుతూ.. 'కన్నడలో మొదటి బయోపిక్ సినిమా చేయాలని అనుకున్నాను. అప్పుడు నా మైండ్‌లోకి విజయ్ శంకేశ్వర్ పేరు వచ్చింది. ఓ ఆరునెలలు పగలురాత్రి అనే తేడా లేకుండా విజయ్ సంకేశ్వర్ గారి గురించి రీసెర్చ్ చేశాం. ఆ తరువాత విజయ్ శంకేశ్వర్ గారిని అప్రోచ్ అయ్యాం. మీ మీద ఓ సినిమా తీయాలని అనుకుంటున్నామని చెప్పాను. నేనేమీ సాధించలేదు.. నా మీద ఎందుకు అని ఆయన అన్నారు. పదిహేను నిమిషాలు టైం అడిగితే.. ఏడెనిమిది గంటల పాటు మాతో మాట్లాడారు. ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి మాకు 150 గంటల పాటుగా ఎన్నో విషయాలు చెప్పారు. ఈ సినిమాను 98 రోజులు షూట్ చేశాం. 75 రోజులు అవుట్ డోర్‌లో చేశాం. అందులో ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేశాం. ఇందులో నేను మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాను. విజయ్ శంకేశ్వర్ గారిలా కనిపించేందుకు బరువు కూడా పెరిగాను. మహానటిలో కీర్తి సురేష్ గారిని చూశాక.. చేస్తే అలా చేయాలని అనుకున్నాను. విజయ్ శంకేశ్వర్ గారి పాత్రను పోషించడం అంటే అది చాలా పెద్ద బాధ్యత. మీరు అందిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషం. మాకు విజయానంద్ సినిమా కాదు.. ఎమోషన్' అని అన్నారు.
 
ఆనంద్ శంకేశ్వర్ మాట్లాడుతూ.. 'మా నాన్న విజయ్ శంకేశ్వర్ గారి జర్నీ 1950లో మొదలైంది. మా తాత గారికి పబ్లికేషన్ ప్రెస్ ఉంది. మా అంకుల్స్ ఇంకా దాన్ని నడిపిస్తున్నారు. అందరం ఇదే వ్యాపారం చేయడం ఎందుకు అనే ఆలోచన మా నాన్నకు వచ్చింది. అందుకే ఈ ట్రాన్స్‌పోర్ట్ ఇండస్ట్రీలోకి వచ్చారు. 1976లో ఒక ట్రక్కుతో ప్రయాణం మొదలైంది.. ఇప్పుడు ఐదువేలకుపైగా చేరింది. ఇంకో పదహారు వందల ట్రక్కులను కూడా మేం ఆర్డర్ చేశాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మా బ్రాంచ్‌లున్నాయి. దేశవ్యాప్తంగా పదిహేను వందల బ్రాంచ్‌లున్నాయి. ఆయ‌నదొక ఇన్‌స్పిరేష‌న‌ల్ జ‌ర్నీ. రిషిక, నిహాల్ మా నాన్నను ఓ అరగంట టైం అడిగారు. కానీ ఎనిమిది, తొమ్మిది గంటలపాటు ఆ మీటింగ్ సాగింది. ఆ తరువాత మా నాన్న నాకు ఫోన్ చేశారు. సినిమా గురించి అభిప్రాయం అడిగారు. సరే చేసేద్దామని అన్నారు. అలా మా వీఆర్‌ఎల్ ప్రొడక్షన్స్ ప్రారంభించాం. ఇక ముందు మంచి చిత్రాలను నిర్మిస్తూనే ఉంటాం. రెండున్నర గంటల్లో ఈ కథను ఇంత అద్భుతంగా చూపించినందుకు రిషిక గారికి థాంక్స్. నిహాల్ గారు అద్భుతంగా నటించారు. సిరి గారు నా తల్లి పాత్రలో నటించారు. భరత్ గారు నా పాత్రను పోషించారు. కురివిల్లా పాత్ర గురించి నేను ఇప్పుడే రివీల్ చేయలేను. రోషిణి గారు మాకు బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. రాంబాబు గారి లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది'ని అన్నారు.
 
అనీష్ కురివిల్లా మాట్లాడుతూ.. 'ఇంత మంచి చిత్రంలో నాకు పాత్ర ఇచ్చినందుకు టీంకు థాంక్స్. కన్నడ సినిమాను చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఆఫర్ వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ టీంను కలిశాక నాకు ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. మా నిర్మాత ఆనంద్ శంకేశ్వర్ గారిని ముందుగా కలిశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో బెంగళూరుకు ఎక్కువగా వెళ్లేవాడిని. అప్పుడు అంతటా వీఆర్‌ఎల్ బస్సులో ట్రావెల్ చేశాను. ఇప్పుడు ఇలా వారి సినిమాలో నటించడం నాకు ఆనందంగా ఉంది' అని అన్నారు.
 
యూఎఫ్‌ఓ లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి థాంక్స్. చార్లీ, యశోద, కార్తికేయ 2 వంటి సినిమాలను మేం రిలీజ్ చేశాం. ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను మా ద్వారా రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హీరో నిహాల్ ఈ పాత్ర కోసం బరువు పెరిగారు. లేడీ డైరెక్టర్ రిషికకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 
భరత్ మాట్లాడుతూ.. 'విజయానంద్ మూవీలో నేను ఆనంద్ శంకేశ్వర్ పాత్రలో నటించాను. ఈ కథ ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వారి కథ. నేను ఈ పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ కచ్చితంగా అందరిలోనూ స్పూర్తినింపుతుందని భావిస్తున్నాన'ని అన్నారు.
 
హీరోయిన్ సిరి ప్రహ్లాదా మాట్లాడుతూ.. 'లలితా శంకేశ్వర్ గారి పాత్రలో నటించాను. ఇంత మంచి సినిమాలో, ఇంత మంచి పాత్రను పోషించినందుకు ఆనందంగా ఉంది. విజయ్, ఆనంద్, లలితా మేడం, రిషికా మేడం, నిహాల్‌ గారికి థాంక్స్. మహానటి సినిమాలోని కీర్తి సురేష్ లాంటి లుక్‌ను కావాలని అన్నారు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థాంక్స్. సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్. డిసెంబర్ 9న మా సినిమా రాబోతోంది. అందరూ మా సినిమాను చూడండి' అని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతపల్లి గ్రామంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి..