Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజున‌ ఫస్ట్ హంట్ లోడింగ్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (19:56 IST)
Balakrishna
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 సందర్భంగా.. ఫస్ట్ హంట్ విడుదల కానుంది
 
“NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్” అని బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న  పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్ హంట్ ని ప్రకటించింది. బాలకృష్ణ పుట్టిన రోజు కానుక గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది.
 
ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
మ్యూజిక్ సెన్సేషన్  థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
 
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
 
సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments