Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూ. ఎన్‌.టి.ఆర్‌.ను చెక్ పెట్టేందుకు తార‌క‌ర‌త్న వ‌చ్చాడు !

Advertiesment
Tarakaratna
, శనివారం, 4 జూన్ 2022 (07:41 IST)
Tarakaratna
ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నంద‌మూరి ఫ్యామిలీలో ఒక్కొక్క‌రు హీరోగా మారిపోతుండ‌డం జ‌రుగుతుంది. తాజాగా నంద‌మూరి జ‌య‌కృష్ణ కొడుకు నంద‌మూరి చైత‌న్య‌కృష్ణ హీరోగా ప‌రిచ‌యంచేస్తూ సినిమా ప్రారంభించారు. ఇంకా ఇద్ద‌రు వార‌సులు రాబోతున్నారు. 
 
గ‌తంలో ఎన్‌.టి.ఆర్‌. అస‌లు వార‌సుడిగా తార‌క‌ర‌త్న వ‌చ్చాడు. ఒకేసారి న‌వ‌గ్ర‌హాల సెంటిమెంట్‌తో 9 సినిమాలు రామ‌కృష్ణా సినీ స్టూడియోస్‌, నాచారంలో ఓపెనింగ్ అయ్యాయి. అది అంద‌రికీ తెలిసిందే.  కానీ ఆత‌ర్వాత చాలా కొండెక్కాయి. 2002లో ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడు సినిమా వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు వ‌చ్చాయి. కానీ ఏదీ స‌రైన హిట్ కాలేదు. న‌టుడిగా ఆయ‌న ఫెయిల్ అనుకుంటున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు ర‌విబాబు ఆయ‌న విల‌న్‌గా అమ‌రావ‌తి సినిమాలో ఇచ్చాడు. అది బాగానే ఆడింది. ఆ త‌ర్వాత అన్నీ అటువంటి వ‌స్తాయ‌ని అనుకున్నాడు తార‌క‌ర‌త్న కానీ రాలేదు.
 
ఇక చాన్నాళ్ళ త‌ర్వాత మ‌ర‌లా వెండితెర ప్ర‌య‌త్నాలు చేశాడు. స‌క్సెస్ కాలేదు. తాజాగా 9అవ‌ర్స్ అనే మాటీవీకి చెందిన వెబ్ సిరీస్ చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌న‌సువిప్పి ప‌లు విష‌యాలు చెప్పాడు. నాకూ ఎన్‌.టి.ఆర్‌.కుటుంబానికి గొడ‌వ‌లు వున్నాయ‌ని, అంద‌రూ న‌న్ను వెన‌క్కు నెట్టేశార‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో వ‌చ్చాయి. అస‌లు జూ. ఎన్‌.టి.ఆర్‌.ను చెక్ పెట్టేందుకు న‌న్ను రంగంలోకి తెచ్చార‌ని అప్ప‌ట్లో వ‌చ్చాయి. కానీ అదంతా నిజంకాదు. జూ. ఎన్‌.టి.ఆర్‌., నాకంటే ముందుకు దూసుకుపోతున్నాడ‌నే ఫీలింగ్ లేదు. ఎప్ప‌టికీ రాదు. క‌ళ్యాణ్‌రామ్‌, నేను, ఎన్‌.టి.ఆర్‌. క‌లుస్తూనే వుంటాం. మాట్లాడుకుంటూనే వున్నాయి. ఇటీవ‌లే తాత‌య్య‌గారి శ‌తజ‌యంతి సంద‌ర్భంగా కూడా క‌లిశాం.

అంతా స‌వ్యంగానే వుంది. బాల‌య్య‌బాబాయ్‌తో కూడా ఉత్స‌వాల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నామ‌ని అన్నారు. మామ‌య్య చంద్ర‌బాబునాయుడుగారు వున్నారు. వారంతా క‌లిసి ఏది ప్లాన్ చేసినా కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తాం. అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన పాన్ ఇండియా మూవీ సాచి