Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన పాన్ ఇండియా మూవీ సాచి

Srinivas Goud, Sanjana, Moolavirat Ashok Reddy, Satyanand
, శనివారం, 4 జూన్ 2022 (07:26 IST)
Srinivas Goud, Sanjana, Moolavirat Ashok Reddy, Satyanand
సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో విధాత  ప్రొడక్షన్ పతాకంపై సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి నటీనటులుగా వివేక్ పోతిగేని దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి యాదార్థ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం  "సాచి".తెలుగు, తమిళ్,, మలయాళం, కన్నడ, బాషలలో నిర్మిస్తున్న ఈ  చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ లో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఆర్టిస్ట్ బిందుపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత రామ్ మెహన్ రావు గౌరవ  దర్శకత్వం  వహించగా, సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో 
 
మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ..తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. దర్శకుడు వివేక్ పోతిగేని అమెరికాలో స్థిరపడ్డా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ  వారి తండ్రి గారి కోరిక మేరకు తెలుగులో దర్శకుడు  అవ్వాలనే కోరికతో  అమెరికాలో కొన్ని షార్ట్ ఫీలిమ్స్ తీస్తూ నా జన్మనిచ్చిన గడ్డ పైన సినిమా తీయాలని నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి "సాచి" కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ప్రయత్నం చాలా మంచిది.మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరానికి చాలా అవసరం అని అన్నారు.
 
దర్శకుడు వివేక్ పోతిగేని మాట్లాడుతూ..మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో బిజీగా  ఉన్నా మేము పిలిచిన వెంటనే  మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చారు  వారికి మా ధన్యవాదములు.నేను అమెరికాలో స్థిరపడ్డా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  కొన్ని యధార్థ  సంఘటనల ఆధారంగా  సినిమా  తీయాలనుకున్నటైంలో  తెలంగాణ లోని ఖమ్మంలో జరిగిన కథ  విన్నాను.మంగలి  వృత్తి చేస్తూ  జీవనం  సాగించే ఒక నిరుపేద కుటుంబ యజమానికి  బ్రెయిన్ ట్యూమర్ బారినపడితే ఆ ట్రీట్మెంట్ కొరకు వారి ఆస్తులను అమ్ముకొని రోడ్డున పడడంతో వారి తండ్రి చేసే  మంగలి  వృత్తిని కూతురు స్వీకరించి, చదువుకుంటూ ఎన్నో అవమానాలు, అవహేళనను ఏదోర్కొన్నా దైర్యంగా  ఆ కుటుంబాన్ని ఎలా పోశించిది అనేది ఈకథ సారాంశం. ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకొని మేము వారి కుటుంబానికి అండగా  నిలబడాలని  కొంత  నగదుతో  సహాయం చేయడం జరిగింది. ఇందులో చాలా మంది కొత్తవారికి నటించే అవకాశం  ఇవ్వడం జరిగింది..మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.
 
చిత్ర నిర్మాత ఉపేన్ నడిపల్లి  మాట్లాడుతూ..యధార్థ  సంఘటనల ఆధారంగా సినిమా  తీద్దాం అని దర్శకుడు వివేక్ చెప్పడంతో ఈ సినిమాను తనతో కలసి నిర్మిస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆలోచింప జేసేలా  ఉంటుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ఆవిష్క‌రించిన చోర్ బజార్ లోని లిరికల్ సాంగ్