మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అభిమానం కారణంగా అనూహ్య ఘటన సంభవించింది. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 12 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సభ్యులు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న జాంటీరోడ్స్ కూడా వరుసలో నించున్నారు. అటు ముంబై బృందంలో ఆ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సచిన్ కూడా ఉన్నాడు.
సచిన్ దగ్గరకు రాగానే జాంటీరోడ్స్ కిందకు వంగి సచిన్ పాదాలను తాకబోయారు. అది ముందే గమనించిన సచిన్ రోడ్స్‌ను ముందుకు నెట్టేసి ఆ పనిచేయకుండా అడ్డుకున్నారు.
ఆ తర్వాత చిరునవ్వు చిందిస్తూ రోడ్స్‌ను హత్తుకున్నారు. జాంటీ రోడ్స్ చూపిన గౌరవానికి చాలా మంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.