Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

సెల్వి
బుధవారం, 27 నవంబరు 2024 (09:48 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో సుబ్బరాజు ఒకరు. ఆయన ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన భార్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫోటోను ఇన్‌స్టా వేదికగా ఆయన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఫోటోలో సుబ్బరాజు దంపతులు వధూవరుల గెటప్‌లో చాలా చక్కగా, సింపుల్‌గా కనిపించారు. అయితే, సుబ్బరాజు భార్య గురించిన వివరాలు ఏమీ వెల్లడించలేదు. 
 
కాగా, సుబ్బరాజు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ విలన్‌ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భీమవరానికి చెందిన సుబ్బరాజు మొదట 'ఖడ్గం' సినిమాలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఆర్య', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి', 'లీడర్‌', 'బిజినెస్‌ మ్యాన్‌', 'బాహుబలి 2' వంటి హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించారు.
 
మరోవైపు, సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలియడంతో చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఇతర రంగాలకు చెందినవారితో పాటు అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, సుబ్బరాజు  వివాహం చేసుకున్న యువతి వివరాలపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments