Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

దేవీ
సోమవారం, 28 జులై 2025 (11:26 IST)
Tarun Bhaskar, Charan Arjun, Varshini
‘‘మోతెవరి లవ్ స్టోరీ’ ట్రైలర్ చాలా బాగుంది. మై విలేజ్ షో టీం అందరికీ స్పూర్తి. ఇక్కడి వాళ్ల గురించి అమెరికాలో మాట్లాడుకునేవారు. ‘పెళ్లి చూపులు’ చేసే టైంలోనూ ఏదో చరిత్ర సృష్టించాలని అనుకోలేదు. సింక్ సౌండ్‌తో ఆ మూవీని చేశాం. ఆ టైంలో మధుర శ్రీధర్ గారు మాకు అండగా నిలిచారు అని తరుణ్ భాస్కర్ మాట్లాడారు.
 
స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్  ZEE5లో ఆగస్ట్ 8న రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని గతంలో రిలీజ్ చేసిన టీజర్‌ను చూస్తేనే అందరికీ అర్థమై ఉంటుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో, దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు.
 
ఇంకా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, భాష, యాస అందరినీ కలిపేసుకుని పోయేలా ఉండాలి. సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు. మై విలేజ్ షో టీం డెడికేషన్, సంకల్పం అన్నింటి కంటే గొప్పది. అనిల్ ఇంకా ఎంతో ఎత్తుకి ఎదుగుతారని నమ్మకంగా చెబుతున్నాను. ఈ ఈవెంట్‌కు నన్ను పిలిచి ప్రమోషన్స్‌లో భాగం చేసిన అందరికీ థాంక్స్. ఈ సిరీస్ అద్భుతంగా ఉండబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
అనిల్ గీలా మాట్లాడుతూ, మా ఊర్లోనే చిన్న చిన్నగా పని చేస్తూ అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు సాధించాం. క్యాస్టింగ్ కాల్ ఎక్కడ కనిపించినా నేను సంప్రదిస్తుండేవాడిని. అలా విజయ్ అన్న ద్వారా తెరపైకి వచ్చాను. తరుణ్ అన్న మా అందరికీ స్పూర్తి. అందరినీ ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. కుటుంబ సమేతంగా మూడు గంటల పాటు ఏడు ఎపిసోడ్స్‌ చూసేలా ఉంటుంది’ అని అన్నారు.
 
మధుర శ్రీధర్ మాట్లాడుతూ .. ‘తెలంగాణలో ఇలాంటి కొత్త కథలు రావడానికి తరుణ్ భాస్కర్ స్పూర్తి. మా కార్యక్రమానికి వచ్చిన ఆయనకు థాంక్స్. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథగా ‘మోతెవరి లవ్ స్టోరీ’ రాబోతోంది. ఈ సిరీస్ తరువాత మరెన్నో గొప్ప ప్రేమ కథలు వస్తాయి. ఇది చాలా కొత్తగా ఉంటుంది. అందరినీ అలరిస్తుంది. అందరికీ ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నా’ అని అన్నారు.
 
నిర్మాత శ్రీరామ్ శ్రీకాంత్ మాట్లాడుతూ .. ‘మేం మొదట్లో పెద్ద చిత్రాలకు స్పూఫ్ చేస్తుండేవాళ్లం. అలా ‘పెళ్లి చూపులు’కి స్పూఫ్ చేసి ప్రైవేట్‌లోనే పెట్టుకున్నాం. మై విలేజ్ షో నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాం. ఇది మాకు ఆరంభమే. మున్ముందు మరింత చేయబోతోన్నాం. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన జీ5కి థాంక్స్’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments