Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

Advertiesment
Vikrant, Chandni Chowdhury, Madhura Sridhar Reddy, Nirvi Hariprasad Reddy

దేవి

, శుక్రవారం, 7 మార్చి 2025 (17:28 IST)
Vikrant, Chandni Chowdhury, Madhura Sridhar Reddy, Nirvi Hariprasad Reddy
విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టీజర్ ఇటీవల విడుదలై భారీ స్పందన తెచ్చుకుంది. ఈ టీజర్‌ను తాజాగా గానా & రేడియో మిర్చి నిర్వహించిన మైండ్ స్పేస్ ఎకో రన్ లో ప్రదర్శించారు. ఈ టీజర్ ఎకో రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి, నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి, దర్శకుడు సంజీవ్ రెడ్డి, రైటర్ షేక్ దావూద్ జీ పాల్గొన్నారు.
 
ఈ చిత్రంలో హీరో విక్రాంత్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో, టీజర్‌లో అతని క్యారెక్టర్‌ను చూసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమతో బాగా రిలేట్ అయ్యారు. ఈ ఈవెంట్‌ను గానా & రేడియో మిర్చి సౌత్ రీజనల్ కంటెంట్ డైరెక్టర్ వాణి మాధవి అవసరాల ప్లాన్ చేసి విజయవంతంగా నిర్వహించారు.
 
నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఇతివృత్తంగా తీసుకుని, యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్