Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలో సంగతి సరే... నిజంగా హీరోయిన్‌కి ఎన్ని పుట్టుమచ్చలున్నాయో చూసావా? విలేకరి వెకిలి ప్రశ్న

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:42 IST)
విలేకరులు ఎలాంటి ప్రశ్నలు వేయాలి? మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలన్నది చాలామందికి తెలియకుండా పోతుంది. కొందరైతే హీరోహీరోయిన్లకు వెకిలి ప్రశ్నలు వేస్తూ వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారు.

 
ఇక అసలు విషయానికి వస్తే... డీజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నేహాశెట్టి పట్ల ప్రముఖ విలేకరి వెకిలి ప్రశ్న వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు హైదరాబాదులో చిత్ర యూనిట్ ట్రెయిలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోయిన్ నేహాశెట్టి గురించి ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించాడు ఓ విలేకరి.

 
డీజే టిల్లు ట్రైలర్లో హీరోయిన్‌కి హీరో ఓ ప్రశ్న వేస్తాడు. నీకు ఎన్ని పుట్టుమచ్చలున్నాయని అడిగితే... పదహారు అంటూ జవాబిస్తుంది. ఈ డైలాగును ఆసరా చేసుకున్న ఓ జర్నలిస్ట్... హీరోయిన్‌కి నిజంగా ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా..? అంటూ హీరోని ప్రశ్నిస్తూ వెకిలి నవ్వు నవ్వాడు.

 
దీనిపై హీరో ఇబ్బందిపడుతూ... దీన్ని అవాయిడ్ చేద్దామంటూ సమాధానం చెప్పారు. ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హీరోయిన్ నేహాశెట్టి సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో స్పందించింది. చిత్ర నిర్మాత సారీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments